వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలు - ప్రధాని మోదీ..!!
ప్రధాని మోదీ మరోసారి వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందిని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తీరు పైన మోదీ సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశ విభజన వాదంతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలను కించపర్చేలా శ్యాంపిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన మోదీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీలోనూ డబుల్ ఇంజన్ రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
సీమలో ఏం జరిగింది
రాయలసీమ ప్రాంతం అనేక మంది ముఖ్యమంత్రులను ఇచ్చినప్పటికీ ఆశించి స్థాయిలో ఏ రంగంలోనూ పురోగతి సాధించలేని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సాగు నీటి ప్రాజెక్టులు లేవన్నారు. ఏపీలోనూ డెవలప్ మెంట్ జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోవటం..మరణించటం తనకు బాధ కలిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

రాయలసీమలో కనిజ సంపదకు లోటు లేదన్నారు. చిత్తూరు జిల్లాలో మంత్రి రౌడీ రాజ్యం నడిపిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోడీ లక్ష్యం అని స్పష్టం చేసారు. ఏపీలోని మాఫియాలు అన్నిటికి ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
కాంగ్రెస్ విభజన వాదం
జలజీవన్ మిషన్ కు ఇక్కడ ప్రభుత్వం సహకరించడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరు అందించడం లేదన్నారు. దేశానికి సమర్థమైన నాయకత్వం ఉందా లేదా అని ప్రశ్నించిన మోదీ..అటువంటి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతందన్నారు. ఖతర్ చిక్కుకున్న వారిని రక్షించామా లేదా అని ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల్లో భారతదేశం గౌరవం పెరిగిందా లేదా చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే వారిని రక్షించడం సాధ్యమయ్యేదా అని అడిగారు. దేశ నిర్మాణం కోసం తాను ఈరోజు కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ రివర్స్ గేర్ లో వెళ్తుందని ప్రధాని విమర్శించారు. రామ మందిరం నిర్మాణంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కాంగ్రెస్ వెనక్కి తీసుకెళ్తామంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా డబల్ ఇంజిన్ సర్కార్ రావాలి
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) May 8, 2024
- ప్రధాని శ్రీ @narendramodi #Modi4APDevelopment pic.twitter.com/AInp69jfNO
డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి
రామ మందిరానికి తాళం వేస్తామంటుందని చెప్పుకొచ్చారు. దేశంలో విభజన వాదం తెచ్చేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి అతి సన్నిహితులైన వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ, మహారాష్ట్ర వాసులు సమర్ధతిస్తారా అని ప్రశ్నించారు.
గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండే వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.దేశంలో పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రాచార్యత ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో బుల్లెట్ రైలు వస్తుందని చెప్పుకొచ్చారు. రాయలసీమలోను పలు రైల్వే లైన్లు చివరి దశలో ఉన్నాయన్నారు.రానున్న ఐదేళ్ల కాలంలో రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏ నుంచి పోటీలో ఉన్న అందరు అభ్యర్దులను గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications