ప్రత్యేక హోదా: 'ఢిల్లీలో చంద్రబాబును పట్టించుకోని మోడీ'
విజయవాడ: ఢిల్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోలేదని లెఫ్ట్ నేత రామకృష్ణ శుక్రవారం నాడు విమర్శించారు. చంద్రబాబు ప్రధాని మోడీతో పోరాడి హోదాను సాధించాలన్నారు.
25న హోదాపై కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. కృష్ణా, గోదావరి నది నీళ్ల పైన ట్రైబ్యునల్ చెప్పినట్లు నడుచుకోవాలన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి అన్నారు. హోదా సాధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఏపీలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందదన్నారు.

కేసుల భయంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీయలేకపోతున్నారన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ ఎమ్మెల్యేలను గెలిచిందన్నారు. త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపడతారన్నారు.
ఉపాధి నిధులు పంచిపెడుతున్నారు: పెద్దిరెడ్డి
ఉపాధి నిధులను టిడిపి కార్యకర్తలకు పంచి పెడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో 200 కోట్ల విలువైన నీరు - చెట్టు పనులు చేపట్టి వాటిని టిడిపి కార్యకర్తలకు కేటాయించారని ఆరోపించారు. దీనిపై సీవీసీ, కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, లేదంటే తిరిగి వైసిపిలోకి రావాలన్నారు.












Click it and Unblock the Notifications