చంద్రబాబు, పవన్ కు ప్రధాని మోదీ బిగ్ అలర్ట్..!!
ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. కూటమి, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ప్రధాని ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏపీలో ఎన్డీఏకు మద్దతుగా ప్రజా స్పందన ఉందని ప్రధాని అంచనా వేస్తున్నారు. అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని జగన్ ధీమాగా చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కు ప్రధాని మోదీ కీలక సూచనలు చేసారు.
ప్రధాని మోదీ సూచనలు
విజయవాడ నగరంలో రోడ్ షో ముగిసిన తర్వాత ప్రధాని మోదీ పది నిమిషాలపాటు టీడీపీ అధినేత చందబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించబోతున్నారంటూ వారిద్దరినీ అభినందించారు. తాను రాష్ట్రంలో ప్రజల్లో అవధుల్లేని ఉత్సాహాన్ని చూస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని మార్చాలన్న బలమైన కోరిక ఉన్నప్పుడే ప్రజల్లో ఇంత దూకుడు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కూటమి పట్ల వారి మొగ్గు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. మామూలు విజయం కాదు... చాలా పెద్ద విజయాన్ని మీరు సాధించబోతున్నారని ప్రధాని చెప్పినట్లు సమాచారం. విజయవాడలో రోడ్‌షో బ్రహ్మాండంగా జరిగిందన్నారు. ప్రజల స్పందన చూస్తే ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోందో ముందే తెలిసిపోతోందని విశ్లేషించారు.
అప్రమత్తంగా ఉండండి
తాను రాష్ట్రంలో పాల్గొన్న సభలన్నీ బాగా జరిగాయని వివరించారు. ప్రజల్లో ఉన్న ఈ సానుకూలతను సంపూర్ణంగా అందుకోవడానికి పోలింగ్ రోజు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం బాగా పెరగాలన్నారు. ఎండలు మామూలుగా లేవని చెప్పారు. చాలా తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా పోలింగ్ బాగా జరిపించుకుంటేనే అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతామని అప్రమత్తం చేసారు.
ఉదయం ఏడు నుంచి పది గంటల్లోపు వీలైనంత ఎక్కువ ఓటింగ్ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేసేలా యంత్రాంగాన్ని కదిలించాలన్నారు. రాలేని వారి కోసం ఏర్పాట్లు చేయండి. పోలింగ్ బూత్‌ల వద్ద మంచినీళ్లు, కాస్త నీడ ఉండేలా చూడాలని సూచించారు. బయటి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తప్పనిసరిగా వచ్చి ఓటు వేసేలా పిలుపివ్వాలన్నారు.

విజయం పై ధీమా
కూటమి కార్యకర్తలు, అభ్యర్థులను ఈ విషయంలో ఇప్పటి నుంచే అప్రమత్తం చేయాలని ప్రధాని మోదీ వారికి సూచించారు. వీటిని అనుసరిస్తామని చంద్రబాబు, పవన్ ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి సంబంధించి తమ సొంత సర్వేల్లో వస్తున్న సమాచారాన్ని చంద్రబాబు ఆయనకు వివరించారు.
కూటమి అఖండ విజయం సాధించబోతోందని, అధికార పార్టీ అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికే కాడి కిందపడేశారని తెలిపారు. కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా ఉంటుందని మోదీ వారిని ఆరా తీశారు. ఆ ఇబ్బందేమీ లేదని, నూటికి నూరు శాతం ఓట్లు కూటమి అభ్యర్థులకు పడతాయని, ఆయా పార్టీల మద్దతుదారులు ఇతరులకు వేసే ఆలోచనలో లేరని పవన్ పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications