నారా రోహిత్ కు ప్రధాని మోడీ లేఖ- ఏమన్నారంటే?

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తాజాగా అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయిన ఆయనకు అనంతరం స్వగ్రామం నారా వారిపల్లెకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి తమ సంతాపం తెలిపారు. మరికొందరు సోషల్ మీడియాతో పాటు నేరుగా కూడా సంతాప సందేశాలు పంపారు.

ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అంతటితో ఆగకుండా రామ్మూర్తి కుమారుడు నారా రోహిత్ కు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధాని మోడీ.. రామ్మూర్తి నాయుడు మరణంపై ఎమోషనల్ గా స్పందించారు. రామ్మూర్తి నాయుడు చనిపోయారని తనకు తెలియగానే తీవ్ర ఆవేదన చెందానని, ఆ లోటు ఎవరూ తీర్చలేనిదని మోడీ తెలిపారు. ప్రజా ప్రతినిధిగా రామ్మూర్తి నాయుడు వారి ఆకాంక్షలను తీర్చడానికి ప్రయత్నించారని వెల్లడించారు.

pm modi s heartfelt condolences to Tollywood hero nara Rohit on father ramurthi s sad demise

ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని ప్రధాని మోడీ తెలిపారు. దాని ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుందన్నారు. అలాగే రామ్మూర్తి నాయుడు అనుసరించిన విలువల ప్రభావం ఆయన కుటుంబంపైనా ఉంటుందన్నారు. ఆయనతో మీ కుటుంబం గడిపిన క్షణాలు ఇలాంటి బాధాకరమైన సమయంలో గుర్తుకొస్తాయన్నారు. ఆయన మీ కుటుంబానికి, స్నేహితులకు, హితులకు దూరమైన వారి హృదయాల్లో మాత్రం కలకాలం ఉండిపోతారన్నారు. ఈ నేపథ్యంలో మీ కుటుంబానికి నా ప్రగాడ సంతాపం, సానుభూతి తెలుపుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+