మొబైల్ హబ్‌గా తిరుపతి: మోడీకి చంద్రబాబు మొబైల్ బహుకరణ (ఫోటోలు)
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర మొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్‌కు శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతికి వెళ్లారు. ముందుగా రేణిగుంట విమాశ్రయంలోని గరుడ టెర్మినల్‌ను ప్రధాన మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో యాత్రికులకు, ప్రయాణికులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
ఈ టెర్మినల్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ది పధంలో నడుస్తుందని ఆయన తెలిపారు. ఆయన వెంట గవర్నర్ నరసింహన్ తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు తదితరులు ఉన్నారు.
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన, ఆ తర్వాత తిరుమల పర్యటనపై తన అభిప్రాయాలను ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఏపీలో మరో కొత్త సంస్థ శ్రీ వెంకటేశ్వరా మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌కు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.
Laid foundation stone for Shri Venkateswara Mobile & Electronics Manufacturing Hub. pic.twitter.com/h2Hs1XL2V3
— Narendra Modi (@narendramodi) October 22, 2015 
మొబైల్ హబ్‌గా తిరుపతి: మోడీకి చంద్రబాబు బహుకరణ
ఈ హబ్‌లో మొబైల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మైక్రోమాక్స్, లావా, సెల్‌కాన్, కార్బన్ మొబైల్ కంపెనీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా రేణిగుంటలో భూములు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొబైల్ హబ్‌గా తిరుపతి: మోడీకి చంద్రబాబు బహుకరణ
ఇటీవలి కాలంలో శ్రీసిటీ సెజ్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్‌లో తయారైన షామీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఆవిష్కరించారు.

మొబైల్ హబ్‌గా తిరుపతి: మోడీకి చంద్రబాబు బహుకరణ
ఫాక్స్‌కాన్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్‌ను ప్రారంభించటంతో దేశీయ మొబైల్ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో మొబైల్ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

మొబైల్ హబ్‌గా తిరుపతి: మోడీకి చంద్రబాబు బహుకరణ
అనంతరం ప్రధాని మోడీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయదశమి రోజున శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ భవిష్యత్తుకు బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications