ఏపీలో రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి: ఘటనపై ఆరా, ఎక్స్‌గ్రేషియా ప్రకటన
అలమండ-కంటకాపల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ప్రధాని మోడీ మాట్లాడారు.
ఘటన స్థలంలో పరిస్థితిపై ఆరా తీసినట్లు పీఎంవో వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

కాగా, ఈ దుర్ఘటనపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్లు కేంద్రమంత్రి ఓ మీడియాకు తెలిపారు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ పెను ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh from the PMNRF for the next of kin of each deceased due to the train derailment between Alamanda and Kantakapalle section. The injured would be given Rs. 50,000. https://t.co/K9c2cRsePG
— PMO India (@PMOIndia) October 29, 2023
ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగివుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖపట్నం-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది.
రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందడంతో ఇప్పటికే సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయని డీఆర్ఎం తెలిపారు.
#WATCH | Andhra Pradesh train accident | Rescue operations underway
— ANI (@ANI) October 29, 2023
6 people died and 18 injured in the Andhra Pradesh train accident: Deepika, SP, Vizianagaram pic.twitter.com/nHYXlC3F2Z
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఇది సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తోంది.
హెల్ప్ లైన్ నెంబర్లు:
రైలు ప్రమాదం నేపథ్యంలో అధికారులు హెల్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications