విజయవాడ - చెన్నై వందేభారత్ , రూట్ ఫిక్స్ - ఈ నెల 7న ప్రారంభం..!!
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్ ప్రారంభం కానుంది. విజయవాడ - చెన్నై వందేభారత్ పట్టాలెక్కనుంది. కొంత కాలంగా ఈ రైలుపైన కసరత్తు చేస్తున్న అధికారులకు తాజాగా రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించింది. ఈ నెల 7న ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చ్యువల్ గా ప్రారంభించనున్న జాబితాలో ఈ రైలు చేర్చారు. రూటు..ధరలు ఖరారు చేసారు. ఈ నెల 8వ తేదీ నుంచి రైలు రాకపోకలు రెగ్యులర్ గా ప్రారంభం కానున్నాయి.
పట్టాలెక్కుతున్న మరో వందేభారత్:తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖ, సికింద్రాబాద్ - తిరుపతి మద్య ఈ ఏడాదిలోనే వందేభారత్ రైళ్లు ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ రెండు రైళ్లకు పెరుగుతున్న ఆదరణతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందేభారత్ రైళ్ల నిర్వహణ దిశగా రైల్వే శాఖ కసరత్తు చేసింది. అందులో భాగంగా రెండు రైళ్లను ఈ నెలలోనే ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - చెన్నై రూట్ లో వందేభారత్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ప్రధాని ఈ రైలును వర్చ్యువల్ గా ప్రారంభించనున్నారు. ఈ లైన్ లో రద్దీ...డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ మార్గానికి అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు.
విజయవాడ - చెన్నై సిద్దం:ఈ రైలు మార్గం ఖరారైంది. రేణిగుంట మీదుగా నడిపేందుకు నిర్ణయం జరిగింది. విజయవాడ నుంచి గూడూరు..రేణిగుంట, కాట్పాడి మీదుగా చెన్నై వేళ్లేలా రూట్ ఖరారు చేసారు. అదే విధంగా తిరుగు ప్రయాణం లోనూ ఈ మార్గంలోనే కొనసాగనుంది. విజయవాడ - చెన్నై మధ్య 48 రైళ్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
అయితే నిత్యం రద్దీ ఉంటోంది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుపుతున్న వందేభారత్ గుంటూరు మీదుగా ఒంగోలు, నెల్లూరు..తిరుపతి చేరుతోంది. ఇప్పుడు విజయవాడ నుంచి తిరుపతి..అదే విధంగా చెన్నై వరకు కొనసాగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. రాత్ర సమయాల్లో ప్రధాన రైళ్ల రాకపోకలపై ప్రభావం పడకుండా ఉదయం సమయాల్లోనే ఈ రైలును నడిపేలా తుది కసరత్తు చేస్తున్నారు.
రేణిగుంట మీదుగా వందేభారత్:విజయవాడ నుంచి చెన్నై రైలు రేణిగుంట ద్వారా నడపటం ద్వారా నిత్యం వేలాది మంది ప్రయాణించే తిరుపతి ప్రయాణీకులకు వెసులుబాటు కలుగుతుందని అధికారులు నివేదిక ఇచ్చారు. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు పెరుగుతున్న రద్దీతో ఈ మధ్య కాలంలోనే కోచ్ లు రెట్టింపు చేసారు.
ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి విజయవాడ మీదుగా అనేక రైళ్లు నిత్యం తిరుపతి..చెన్నైకు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా వందేభారత్ ను నడపటం ద్వారా చెన్న, తిరుపతి కి వెళ్లే రద్దీని తగ్గించేందుకు ప్రయోజనంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు ప్రయాణ వేళలు..టికెట్ ధరలు..ఏ స్టేషన్లలో స్టాపేజీ ఉంటుందనేది ఒకటి రెండు రోజుల్లో రైల్వే అధికారులు ప్రకటించనున్నారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications