ఏపీకి ప్రధాని మోదీ, అమిత్ షా - అక్కడే కొత్త టెన్షన్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక హోరా హోరీగా సాగుతోంది. కూటమి, వైసీపీ మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. జగన్ బస్సు యాత్రలతో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు -పవన్ కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు పార్టీల పొత్తు ఖరారైన తరువాత ప్రధాని మోదీ తొలి సభలో పాల్గొన్నారు. ఇప్పుడు మూడు సభల్లో ఏపీలో ప్రచారం చేసేల షెడ్యూల్ ఖరారవుతోంది. ఇదే సమయంలో కొత్త టెన్షన్ మొదలైంది.

ప్రచారానికి ముఖ్య నేతలు
ఏపీలో ప్రధాని మోదీ మరోసారి ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ప్రధానితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ప్రచార సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. వచ్చే నెల తొలి వారంలో ప్రధాని మోదీ మూడు లేదా నాలుగు సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సభల్లో పొల్గొంటారు. పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగీ ప్రచార సభకు తీసుకొచ్చేలా బీజేపీ ముఖ్య నేతలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ నెల 19న నామినేషన దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

PM Modi to particiapate inTwo meetins as election campaign in AP Along with alliance partners

బీజేపీ పోటీ చేసే స్థానాల్లో
విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రంగా ప్రధాని మోదీ, అమిత్ షా సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ధర్మవరం, జమ్మలడుగులో జరిగే సభల్లో నడ్డా పాల్గొంటారని చెబుతున్నారు. టీడీపీ - బీజేపీ మధ్య కొన్ని సీట్ల మార్పు గురించి తుది చర్చలు జరుగుతున్నాయి. వీటి పైన స్పష్టత వచ్చిన తరువాత ప్రచార సభల తేదీ పైన నిర్ణయం తీసుకోనున్నారు. అనపర్తి సీటు తిరిగి టీడీపీకి, ఆ స్థానంలో తంబళ్ళపల్లె బీజేపీకి ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రఘరామ రాజు ఉండి నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రధాని చిలకలూరిపేటలో సభ తరువాత రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

PM Modi to particiapate inTwo meetins as election campaign in AP Along with alliance partners

మారుతున్న రాజకీయం
ముఖ్యమంత్రి జగన్ పైన ఎలాంటి ఘాటు విమర్శలు చేయకపోవటం టీడీపీ శ్రేణులకు రుచించటం లేదు. ఇప్పుడు ప్రధాని మరోసారి పర్యటనకు వస్తున్న వేళ అదే తరహాలో వ్యవహరిస్తారా..జగన్ పైన గురి పెడతారా అనే చర్చ మొదలైంది. అటు జగన్ సైతం ఈ నెల 25వ తేదీ నుంచి రోజుకు మూడు సభల చొప్పున ఎన్నికల ప్రచారం వేగం పెంచేందుకు నిర్ణయించారు. దీంతో..రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న వేళ ఏపీ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+