కొత్త ప్రభుత్వంలొ తొలిసారి రైతుల ఖాతాల్లో నిధుల జమ..!!
రైతులకు గుడ్ న్యూస్. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తరువాత తొలి సారి రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రైతులకు అందించే పీఎం కిసాన్ నిధులను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. 17వ విడత కింద రూ.20 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులను వారాణసీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారు. 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమకానున్నాయి. 17వ విడత నిధులతో కలిపి లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.3.24 లక్షల కోట్లు దాటుతుంది.
మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే సందర్భంగా రూ.20 వేల కోట్లతో పీఎం- కిసాన్ పథకం 17వ విడత డబ్బులను విడుదల చేయనున్నారు. దీని ద్వారా దేశంలోని 9.26 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 17వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదలపై తొలి సంతంకం చేశారు. జూన్ 18న బటన్ నొక్కి రైతుల ఖాతాలో 17వ విడత పీఎం కిసాన్ డబ్బులు జమ చేయనున్నారు.

2019లో పీఎం కిసాన్ యోజన అమల్లోకి వచ్చింది. 3 దశల్లో రైతుల ఖాతాలో రూ.6వేలు జమ చేశారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు రూ.3.40 లక్షల కోట్లు పంపిణీ చేశామన్నారు. గతంలో కేవైసీ పూర్తి చేసుకోని రైతులు, ఇతర టెక్నికల్ సమస్యల కారణంగా గత రెండు దఫాలుగా డబ్బులు తీసుకోని రైతుల ఖాతాల్లో ఈ సారి ఏకంగా రూ.6 వేలు జమ కానున్నాయివ్యవసాయ పద్ధతుల్లో రైతులకు సహకారాన్ని అందించేందుకు 'కృషి సఖీ'లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 30 వేల మందికి సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications