పవన్ ను ఇక... మోదీకి అన్నా లెజినోవా ప్రామిస్..!!

ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి వచ్చిన వేళ పండుగ వాతావరణం నెలకొంది. పవన్ కుటుంబ సభ్యులు మోదీకి ఆత్మీయ ఆహ్వానం పలికారు. పవన్ ఆరోగ్యం పైన మోదీ ఆరా తీసారు. రాజకీయంగా మంచి భవిష్యత్ ఉందని.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. పవన్ కుమార్తెలు, అకీరా - మార్క్ శంకర్ తోనే ముచ్చటించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ చేసిన సూచనకు స్పందనగా పవన్ విషయంలో అన్నా లెజీనోవా ప్రామిస్ చేసారు.

ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి ప్రధాని మోదీ వచ్చారు. నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు కొంతసేపు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రజా సేవలో ఎంతో భవిష్యత్ ఉందని.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ కు మోదీ సూచించారు.

pm-modi-visited-pawan-kalyan-at-his-residence-and-enquired-about-his-health-after-his-recent-surgery

ఈ భేటీ అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన్నా లెజినోవా పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని మోదీతో దిగిన ఫోటోలను షేర్ చేసిన ఆమె, తన భర్త ఆరోగ్యంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ చూపారని పేర్కొన్నారు. ముందుగా ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని, పూర్తిగా కోలుకున్నాకే తిరిగి పని ప్రారంభించాలని ప్రధాని మోదీ సూచించిన విషయాన్ని వెల్లడించారు.

మోదీ లెక్కే వేరు: మాతో 'కలవండి'.. సీఎం రేవంత్‌కు ఓపెన్ ఆఫర్‌ వెనుక..!!
మోదీ లెక్కే వేరు: మాతో 'కలవండి'.. సీఎం రేవంత్‌కు ఓపెన్ ఆఫర్‌ వెనుక..!!

పవన్ కల్యాణ్ కు కీలక సూచనలు

అదే సమయంలో ప్రధాని మోదీ తనకు పవన్ ను జాగ్రత్తగా చూసుకోవాలి అని చేసిన సూచనను ప్రస్తావించారు. ప్రధాని చూపించి ఆత్మీయత తనకు ఎంతో సంతోషం కలిగించిందని.. పవన్ ను జాగ్రత్తగా చూసుకుంటానని మోదీకి ప్రామిస్ చేసానని అన్నా లెజినోవా తన పోస్టులో పేర్కొన్నారు. అన్నా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆమె పోస్టుపై స్పందిస్తూ పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోవైపు ప్రధాని మోదీ పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా పవన్ కుమార్తెలతోనూ మోదీ సంభాషించారు. వారి చదువు.. భవిష్యత్ ప్రణాళికల పైన అడిగి తెలుసుకున్నారు. అకీరా నందన్ తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధాని స్వయంగా తమ ఇంటికి రావటం.. పరామర్శించటం పై పవన్ సంతోషం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+