వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మనసులో మాట..!! జగన్ - చంద్రబాబు-పొత్తు : నథింగ్ డూయింగ్:..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీ రాజకీయాలపైన ప్రధాని మోదీ ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ-టీడీపితో బీజేపీ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండనున్నాయి. కొద్ది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఈ ప్రశ్న మొదలైంది. బీజేపీతో 2019 ఎన్నికల ముందు నుండి సన్నిహితంగా ఉంటున్న జగన్..ఇప్పుడ సడన్ గా పార్లమెంట్ కేంద్రగా నిరసనగా ఆయన ఎంపీలు సభను అడ్డుకుంటు న్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇక, చంద్రబాబు జరుగుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

 ప్రధానికి స్పష్టమైన అభిప్రాయం..

ప్రధానికి స్పష్టమైన అభిప్రాయం..

ఇదే సమయంలో స్వతహాగా ఏ అభిప్రాయం ఏ సమయంలోనూ అంత త్వరగా బయటకు వెల్లడించని ప్రధాని మోదీ...తన మనసులోని అభిప్రాయన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. ఏపీకి చెందిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం..బీజేపీ వ్యవహారాల్లో బలమైన వాయిస్ వినిపించే ఒక నేత తాజాగా ప్రధానిని కలిసారాు. ఆ సమయంలో ఏపీ వ్యవహారాలు చర్చకు వచ్చాయి. ఏపీలో పార్టీ పరిస్థితులు..పాలనా వ్యవహారాల పైన ప్రధాని ఆ నేత నుంచి ఆరా తీసారు. అదే సమయంలో దేశంలో కరోనా కారణంగా చోటు చేసుకున్న మరణాల పైన ప్రధాని ఆ నేతతో ఆవేదన వ్యక్తం చేసారు.

 జగన్ అందులో బాగా చేసారు..

జగన్ అందులో బాగా చేసారు..

ఇక, ఏపీలో కరోనా నియంత్రణ చర్యల పైన ప్రధాని స్పందించారని విశ్వసనీయ సమాచారం. ఆ సందర్భంలో ఏపీలో మెగా వ్యాక్సినేషన్ నిర్వహణ పైన స్వయంగా ప్రధాని ప్రస్తావించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏపీలో వ్యాక్సినేషన్ నిర్వహణ పైన ప్రధాని ఆ నేత వద్ద సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసించారని తెలిసింది. జగన్ తనకు వ్యాక్సినేషన్ అంశంలో లేఖలు రాసిన అంశాన్ని..అందులో పేర్కొన్న అంశాల పైన ప్రధాని ఆ నేత వద్ద సానుకూలంగా ఉన్నట్లుగా ఆ సమావేశం తరువాత ఆ నేత తన సన్నిహితుల తో షేర్ చేసుకున్నారు.

నథింగ్ డూయింగ్ అంటూ ప్రధాని..

నథింగ్ డూయింగ్ అంటూ ప్రధాని..

ఇక, అదే సమయంలో ఆ నేత ఏపీలో బీజేపీ పరిస్థితులను వివరించారు. వాటిని మౌనంగా ఆలకించటం మినహా ప్రధాని ఎటువంటి వ్యాఖ్య చేయలదేని తెలుస్తోంది. ఇక, ఆ నేత చొరవ తీసుకొని ఏపీలో తిరిరి బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేసారు. ఆయన చెప్పే అంశం పూర్తి కాకుండానే...ఏం చెప్పబోయేది అర్దం చేసుకున్న ప్రధాని ..మధ్యలోనే అడ్డుకొని నథింగ్ డూయింగ్ అంటూ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఢిల్లీలో మాత్రం టీడీపీ నేతలు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 నాటి అతివిశ్వాసమే చంద్రబాబుకు నేటికీ..

నాటి అతివిశ్వాసమే చంద్రబాబుకు నేటికీ..

2019 ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ప్రధాని మోదీని వ్యక్తిగతంగా చేసిన విమర్శలతోనే అంతలా ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న ప్రయత్నాలు..బీజేపీ నేతల మూడ్ పైన జగన్ సైతం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల వేళ..మోదీ ఓటమి ఖాయమంటూ..కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు..బీజేపీకి పూర్తిగా దూరమయ్యారు. ప్రధానిగా మోదీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీకి దగ్గర కాలేక..తిరిగి కాంగ్రెస్ తో కంటిన్యూ కాలేక చంద్రబాబు పరిస్థితి త్రిశంకు స్వర్గంగా మారింది.

 ఢిల్లీ కేంద్రంగా మారుతున్న సమీకరణాలు..

ఢిల్లీ కేంద్రంగా మారుతున్న సమీకరణాలు..

దీంతో..2019 లో చేసిన విధంగా కాకుండా... సార్వత్రిక ఎన్నికల సమయం వరకు వేచి చూసే ధోరణితో చంద్రబాబు ఉన్నారు. జాతీయ రాజకీయాలకంటే ముందుగా ఏపీలో జగన్ ను దెబ్బ తీయటం చంద్రబాబు లక్ష్యం. రానున్న ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారబోతున్నాయి. దీంతో..కేంద్రంతో సఖ్యత కొనసాగించాలని జగన్ ... ఎలాగైనా బీజేపీకి జగన్ ను దూరం చేయాలని టీడీపీ... ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా తమ తోనే ఆ పార్టీ ఉండేలా బీజేపీ ఎవరికి వారు ఎప్పటికప్పుడు లెక్కలు సరి చేసుకుంటున్నాయి. దీంతో..ఢిల్లీ కేంద్రంగా రానున్న రోజుల్లో చోటు చేసుకొనే పరిణామాలు మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

English summary
Prime Minister Modi seems to maintain a good relation with AP CM Jagan and has no interest to allign with TDP Chief Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X