ఎన్నికల వేళ అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక అడుగు..!!
ఏపీలో ఎన్నికల వేడి పెరిగింది. ఈ సమయంలోనే అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక అడుగు వేయనున్నారు. మంగళగిరితోపాటు దేశంలోని అయిదు అఖిల భారత వైద్య విద్యా సంస్థలను (ఎయిమ్స్) ఈ నెల 25న ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటుగా ఏయిమ్స్ లోని 9 క్రిటికల్ కేర్ బ్లాకులను శంకుస్థాపన..విశాఖలోని మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
అత్యున్నత వైద్యం: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. నాలుగేళ్ల నాటితో పోల్చితే ప్రస్తుతం చికిత్సలతో పాటు రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వచ్చిన వారికి అత్యున్నత వైద్యం అందిస్తూ... వైద్యులు ప్రశంసలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల కంటే... ఖర్చుతో పాటు సేవల్లో నాణ్యత బాగుందని రోగులు చెబుతున్నారు.

విభజన చట్టం ప్రకారం ఏర్పాటై 2019 మార్చి 12న ఓపీ సేవలు మంగళగిరి ఎయిమ్స్ లో మొదలయ్యాయి. క్రమేణా సేవల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మొదటి రోజున 44మంది రోగులు ఆస్పత్రికి రాగా, ప్రస్తుతం బిజీ రోజుల్లో 2వేల500మంది వరకు సేవలు పొందుతున్నారు.
సూపర్ స్పెషాలిటీ సేవలు: బ్లండ్ బ్యాంకు, సీటీ, ఎమ్ఆర్ఐ, పీఈటీ స్కానింగ్, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, కాన్పులు, రేడియో థెరపీ, ట్రామాతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆయుస్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తున్నారు. వైద్య కళాశాలలో 125 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ విభాగంలో 40 సీట్లు ఉన్నాయి.
గతేడాది నర్సింగ్ కళాశాల కూడా ప్రారంభమైంది. క్యాన్సర్, మూత్రపిండాలు, ఉదరకోశ వ్యాధులకు ఎయిమ్స్‌లో మంచి వైద్యం అందుతోంది. 41 బ్రాడ్ సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా పని చేస్తున్నాయి. 183.11 ఎకరాల విస్తీర్ణంలో 1618.23 కోట్ల రూపాయల వ్యవయంతో మంగళగిరి ఏయిమ్స్ నిర్మాణం జరిగింది.
A New Dawn for Healthcare Ecosystem of West Bengal!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 23, 2024
PM @NarendraModi Ji to dedicate #AIIMSKalyani to the nation on 25th February.
পশ্চিমবঙ্গের স্বাস্থ্যসেবা ব্যবস্থার এটি একটি নতুন ভোর ! প্রধানমন্ত্রী শ্রী নরেন্দ্র মোদীজি ২৫ শে ফেব্রুয়ারী জনসাধারণকে এইমস কল্যাণী উৎসর্গ করবেন। pic.twitter.com/U0GBfIUvLX
జాతికి అంకితం: ఇక్కడ ఓపీ ఫీజు 10 రూపాయలే. వివిధ రకాల ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు బయటి ధరలతో పోలిస్తే 30నుంచి 40శాతం తక్కువ. 2018లోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) కోర్సు ప్రారంభమైంది. ఏడాదికి 125 మంది చొప్పున ప్రస్తుతం 600 ఎంబీబీఎస్ విద్యార్ధులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
వంద మంది విద్యార్ధులు వివిధ విభాగాలలతో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంగా ఏయిమ్స్ ప్రారంభించారు. ఇప్పుడు ఏయిమ్స్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మరిన్ని సేవలతో విస్తరణ... సదుపాయాల కల్పన దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications