ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ కీలక పరిణామాలు..!!

ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖ రానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని.. ఆ తరువాత రాష్ట్రానికి వస్తున్నారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటంతో ప్రధాని పర్యటన ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాని రాక వేళ విశాఖలో భారీ రోడ్ షో కు ప్లాన్ చేసారు. పలు కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత జరిగే బహిరంగ సభలో ఏపీకి సంబంధించి ప్రధాని కీలక ప్రకటన చేస్తారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

భారీ రోడ్ షో - సభ
ప్రధాని మోదీ ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నంలోని ఐఎన్‌ఎ్‌స డేగా (నేవల్‌ ఎయిర్‌స్టేషన్‌)లో దిగుతారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. అనంతరం నేవీ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన 4.45 గంటలకు బయలుదేరి జాతీయ రహదారిలో తాటిచెట్లపాలెం జంక్షన్‌, సంపత్‌ వినాయక్‌ గుడి, దత్తా ఐలాండ్‌ మీదుగా ఏయూ ఎకనామిక్స్‌ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకూ రోడ్ షో లో పాల్గొంటారు. అక్కడి నుంచి ఓపెన్‌టాప్‌ వాహనం పై నుంచి ప్రజలకు అభివాదం చేస్తారు. త్రీటౌన్‌ జంక్షన్‌ మీదుగా ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

PM Modi will reach the port city on 8th evening and will hold a road show to launch many development programmes

చంద్రబాబు, పవన్ తో కలిసి
రోడ్ షో లో ప్రధానితో పాటుగా ఓపెన్‌టాప్‌ వాహనంపై ప్రధానితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ డిప్యూటీ సీఎం పవన్ కేంద్ర మంత్రులు ఉంటారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ప్రధాని సభా ప్రాంగణంలో ఉంటారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బహిరంగ సభలో తొలుత గవర్నర్‌, సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల తర్వాత ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 6.30 గంటలకు సభ ముగిసిన తర్వాత తిరిగి రోడ్డు మార్గాన ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఏడు గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు. కాగా, పూర్తిగా ఇది అధికారిక పర్యటన కావటంతో రాజకీయ ప్రసంగాలు చేసే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

ప్రధాని స్పందన
ఇదే సమయంలో కేంద్రంలో ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ ఏపీ విషయంలో అన్ని అంశాల పట్ల సానుకూలంగా ఉంటున్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం అంశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. నిధులు ప్రకటించారు. ఇప్పుడు ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్ అంశంగా ఉన్న స్టీల్ ప్లాంట్ పైన నిర్ణయం ప్రకటించాలనే డిమాండ్ వినిపి స్తోంది. జమిలికి సిద్దం అవుతున్న వేళ దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు బీజేపీకి కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పైన ప్రకటన చేస్తారా అనే చర్చ వినిపిస్తోంది. ప్రధాని తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+