ఏపీ, తెలంగాణలో ఈ స్టేషన్లలో మార్పు - ప్రయాణీకులకు ఇక నుంచి..!!

రైల్వే మంత్రిత్వ శాఖ "అమృత్ భారత్ స్టేషన్" పథకం పేరుతో స్టేషన్ల ఆధునీకరణ కోసం కొత్త విధానాన్ని రూపొందించింది. దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన స్టేషన్ల అభివృద్ధి కోసం ఈ పథకం అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా దశల వారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో రూ.2,079.29 కోట్లతో 50 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా అభివృద్ధి చేయాలని నిర్ణయంచారు.

అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో రూ.2,079.29 కోట్లతో 50 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (ఏబీఎ్‌సఎస్‌) కింద చేపట్టనున్న పనులకు ఆదివారం ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 15, మహారాష్ట్రలో 13, కర్ణాటకలో ఒక రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.

PM Modi will virtually lay the foundation stone for the redevelopment of 50 railway stations in SCR zone on Sunday

హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో నిజామాబాద్‌ జంక్షన్‌(రూ.53.3 కోట్ల వ్యయం), కర్నూల్‌ సిటీ స్టేషన్‌ (రూ.42.6కోట్లు), కామారెడ్డి(రూ.39.9కోట్లు), మహబూబ్‌నగర్‌ (రూ.39.9కోట్లు) మలక్‌పేట్‌ (రూ.36.4 కోట్లు), మల్కాజ్‌గిరి (రూ.27.6కోట్లు), ఉప్పుగూడ(రూ.26.8కోట్లు), హైదరాబాద్‌ స్టేషన్‌(రూ.30.9కోట్లు) లు ఈ జాబితాతో ఉన్నాయి.

జాబితాలో ఉన్న స్టేషన్లు: వీటితో పాటుగా మహబూబాబాద్‌ (రూ.39.7కోట్లు), హఫీజ్‌పేట్‌ (రూ.26.6 కోట్లు), హైటెక్‌సిటీ (రూ.26.6కోట్లు), కరీంనగర్‌ (రూ.26.6 కోట్లు), రామగుండం (రూ.26.5కోట్లు), ఖమ్మం (రూ.25.4 కోట్లు), మధిర (రూ.25.4కోట్లు), జనగామ(రూ.24.5కోట్లు), కాజీపేట్‌ (రూ.24.5కోట్లు), యాదాద్రి (రూ.24.5 కోట్లు), భద్రాచలం రోడ్‌ (రూ.24.4కోట్లు), బీదర్‌ (రూ.24.4కోట్లు), పర్లీవైజ్ఞాథ్‌ (రూ.24.4కోట్లు), తాండూర్‌ (రూ.24.4కోట్లు), జహీరాబాద్‌ (రూ.24.కోట్లు) రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

విజయవాడ డివిజన్‌లో 11 స్టేషన్ల రీ డెవలప్‌మెంట్ చేయనున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లు తొలి జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

రూపు రేఖలు మార్చుతూ: ఈ స్టేషన్లలో సమూలంగా మార్పులు చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. స్టేషన్లలో ప్రయాణీకులకు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. స్థానిక రైల్వే డివిజన్ అధికారులు చేసిన ప్రతిపాదనలకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దశల వారీగా అన్ని స్టేషన్లను అభివృద్ధి చేయటమే ఈ పథకం లక్ష్యంగా అధికారులు స్పష్టం చేసారు.

సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు పరిశుభ్రమైన రైల్వే ప్రాంగణాన్ని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా సాధారణ ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+