ప్రధాని మోడీని ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ: ఐరాసలో స్పీచ్..అలాంటి వారికి కనువిప్పు

అమరావతి: న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి 76వ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పట్ల భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రత్యర్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తోన్నారు. యునానిమస్‌గా ప్రధాని ప్రసంగాన్ని స్వాగతిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఏ ఒక్క దేశం కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకోకూడదంటూ మోడీ సూచించడం గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, ఆఫ్ఘనిస్తాన్‌ను టెర్రరిజానికి షెల్టర్ జోన్‌‌లా మార్చకూడదంటూ అత్యున్నత వేదిక మీదుగా ప్రధాని హెచ్చరించడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెబుతున్నారు. ఈ జాబితాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. ప్రధాని మోడీ ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ స్వాగతించింది. ఆయన చేసిన ప్రసంగంలోని ప్రతి అంశం కూడా దేశ ప్రజల మనోభావాలను ప్రతిఫలింపజేసిందని స్పష్టం చేసింది.

ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం సహేతుక చర్యగా భావిస్తున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రపంచానికి కావాల్సింది ఉగ్రవాదం కాదని, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధిని సాధించడమేనని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాదం మీద ఆధారపడుతూ.. ఆ భూతాన్ని పెంచి పోషిస్తోన్న కొన్ని దేశాలకు ప్రధాని ఇచ్చిన ప్రసంగం కనువిప్పు కలిగించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

PM Modi’s speech in UNGA should be an eye-opener for those who sponsor terrorism: Vijayasai Reddy

ఉగ్రవాదానికి ఎక్కడా ఆశ్రయం దక్కదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు కావాల్సింది అభివృద్ధి, పరివర్తనే తప్ప అశాంతియుత వాతావరణానికి కారణం అయ్యే ఉగ్రవాదం కాదని చెప్పారు. భారత్ పురోగమనం.. ప్రపంచ పురోగమనంగా ప్రధాని మోడీ అభివర్ణించడాన్ని విజయసాయి రెడ్డి స్వాగతించారు. ప్రపంచ దేశాలకు భారత్ మార్గదర్శనం చేస్తోందని పేర్కొన్నారు.

భారత్.. ప్రపంచ దేశాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారిందని మోడీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రసంగాన్ని విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. భారత్ నేడు అభివృద్ధి సాధిస్తే.. ప్రపంచం రేపు దాన్ని అనుసరిస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో చోటు చేసుకుంటోన్న పరిణామాలను ప్రపంచ దేశాలు అనుకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం యువతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని, దాన్ని ఎక్కడికక్కడ అణచివేయాల్సిందేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+