వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో గెలిచినట్లే, మమతా బెనర్జీతో మాట్లాడా: చంద్రబాబు,

రాష్ట్రపతి ఎన్నికలు నామమాత్రమేనని, ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు నామమాత్రమేనని, ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు తథ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.

రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నామినేషన్ పత్రాల్లోని రెండో సెట్‌లో సంతకం చేసిన విషయం తెలిసిందే.

కేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరా కేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరా

రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒక ఉన్నతమైన అభ్యర్థిని రాష్ట్రపతిగా ఎన్డీయే ఎంపిక చేసిందని, ఆయనకు అన్ని విధాలా టిడిపి సహకరిస్తుందని తెలిపారు.

PM Narendra Modi, Amit Shah, Chandrababu Naidu proposers for Ram Nath Kovind in president polls

అన్ని పార్టీలను కలిశామని చంద్రబాబు అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో తాను మాట్లాడానని చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్ ఏకగ్రీవం అయి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు కూడా అన్నారని తెలిపారు.

ఉన్నతమైన సంప్రదాయాలు కలిగిన, ఒక చరిత్ర కలిగిన వ్యక్తిని ప్రధాని మోడీ ఎంపిక చేశారని, అలాంటి వ్యక్తికి అందరూ సహకరించాల్సి ఉందని, ఎన్నికలు నామమాత్రేనని, ఇప్పటికే రామ్‌నాథ్ గెలిచినట్లేనని, అయితే టెక్నికల్‌గా ఎన్నికలు జరగాలన్నారు. ఇలాంటి ఉన్నతమైన పదవి విషయంలో అందరి సహకరిస్తే దేశం ప్రతిష్ట, ఆ పదవి గౌరవం పెరుగుతుందన్నారు.

English summary
PM Narendra Modi, Amit Shah, Chandrababu Naidu proposers for Ram Nath Kovind in president polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X