ఎంపీ రామ్మోహన్ నాయుడుకు తియ్యటి శుభవార్త వినిపించిన మోడీ
ఉత్తరాంధ్రవాసులకు రైల్వేశాఖ తియ్యటి శుభవార్తను వినిపంచింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు కొత్తగా ప్యాసింజరు రైలు సౌకర్యం కలుగుతోంది. ఈ ప్రాంతవాసులకు కొన్నాళ్లుగా విశాఖపట్నం వెళ్లివచ్చేందుకు వీలుగా ఎటువంటి ప్యాసింజరు లేక ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ బాధితులు చికిత్స కోసం వెళ్లాలంటే బస్సుల్లో వెళ్లేందుకు ఎక్కువ ఖర్చు అవుతోంది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కొన్నాళ్లుగా రైల్వే అధికారులను కలిసి పలాస ప్యాసింజరు రైలును బ్రహ్మపుర వరకు పొడిగించాలని కోరుతూ వస్తున్నారు. దీంతో ఈ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించడంతో ఎంపీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బ్రహ్మపురలో తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరే ఈ రైలు 4.09 గంటలకు ఇచ్చాపురం, 4.22 గంటలకు సోంపేట, 4.33 గంటలకు మందస, 5.00 గంటలకు పలాస, 9.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి 10.31 గంటలకు ఇచ్చాపురం, 10.47 గంటలకు బ్రహ్మపుర చేరుకుంటుంది.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కువగా రైల్వేపై దృష్టిసారించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వీలు రైలు వల్ల కలగడంతో ప్రజల ప్రయాణ సౌకర్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ రైళ్లతోపాటు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పేరుతో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. అలాగే సిగ్నలింగ్ వ్యవస్థవల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాటిని ఆధునికీకరించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications
