ప్రధాని పబ్లిసిటీ పిచ్చి.!ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా మోదీ పట్టించుకోవట్లేదన్న శైలజానాథ్.!

అమరావతి/హైదరాబాద్ : కరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్గాలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. అందులో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. విజయవాడ ఏపీసీసీ భవన్‌‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీసిసి ఛీఫ్ సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు శైలజానాథ్. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని ఘాటుగా విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, అందుకే ప్రజల ప్రాణాలు బలైపోతున్నా పట్టించుకునే స్థితిలో ప్రధాని లేరని శైలజానాథ్ తీవ్రంగా విమర్శించారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని కేంద్ర ప్రబుత్వంపై నిప్పులు చెరిగారు శైలజానాథ్.

PM publicity madness.!Shailajanath says Modi does not care if people are dying out.!
కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు పోటీలు పడి ప్రజలపై ఆర్థిక భారాలు పెంచుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు ఏపీసిసి ఛీఫ్. పేదలకు కరోనా సమయంలో పది‌వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు శైలజానాథ్. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ బాటలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారన్నారని, ధరలను అదుపు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను మోసం‌ చేస్తున్నారని శైలజానాథ్ ధ్వజమెత్తారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నేతలు నిరసన దీక్షకు దిగారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. విజయవాడ ఏపీసీసీ భవన్‌లో నిరసనకు దిగారు. తాళ్లతో ఆటో లాగుతూ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+