ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..!

ఇరాన్ వార్ తెచ్చిన ఎల్బీజీ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వాలు సహజవాయువు (PNG)ని తెరపైకి తెస్తున్నాయి. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న మేరకు పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇవాళ సమీక్ష నిర్వహించిన సీఎస్ సాయిప్రసాద్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారుల కోసం భారీ సబ్సిడీ ప్రకటనతో పాటు ఇతర వివరాలను వెల్లడించారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో ఏర్పడుతున్న అంతరాయాలను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రంలో నగర ఇంధన పంపిణీ (City Gas Distribution-CGD) వ్యవస్థపై ప్రభావాన్ని ప్రభుత్వం సమీక్షిస్తోంది.
ఇందులో భాగంగా సీఎస్ సాయి ప్రసాద్ అధ్యక్షతన స్టేట్ లెవెల్ యుటిలిటీస్ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం ఇవాళ జరిగింది. ఇందులో సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు AP CGD Right of Way Rules, 2026 ద్వారా అనుమతుల ప్రక్రియను సరళీకరించి, 24 గంటల్లో డీమ్డ్ అనుమతులు, సింగిల్ విండో వ్యవస్థ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేయనున్నారు.

PNG Push AP Government Speeds Up LPG Conversion Releases details of Subsidy Amount

ప్రజలకు PNG వినియోగాన్ని పెంచేందుకు సంవత్సరానికి ₹2,400 సబ్సిడీతో డీబీటీ పథకం ప్రవేశపెడుతూ.. ఎల్బీజీపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందని సీఎస్ తెలిపారు. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణ ద్వారా ₹400 కోట్ల పెట్టుబడితో CGD మౌలిక సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాలో 10 వేల PNG కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని, వాణిజ్య-పరిశ్రమల వినియోగాన్ని విస్తరించడం ద్వారా శుభ్రమైన ఇంధన వినియోగంలో రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. సహజ వాయువు విస్తరణకు అన్ని ఆయిల్ కంపెనీలు సహకరించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+