LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..!

ఇరాన్ వార్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో యుద్ద భయాలతో గ్యాస్ సిలెండర్లను కృత్రిమంగా బ్లాక్ చేస్తున్నారు. అదే సమయంలో సమస్య పరిష్కారం కోసం కేంద్రం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నిబంధనలను సైతం సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్ (LPG refill booking) పై కేంద్రం ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్స్ నిబంధనలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఓ ట్వీట్ చేసింది. ఇందులో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనలలో మార్పులు జరిగాయని వార్తాపత్రికలలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సరికావని తెలిపింది.ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ నిబంధనలలో ఎటువంటి మార్పు లేదని తేల్చిచెప్పేసింది.

LPG Refill Booking Petroleum Ministry says No Change in Timelines Ignore Rumours of New Norms

రెండు రీఫిల్ బుకింగ్‌ల మధ్య కనీస వ్యవధి పట్టణ ప్రాంతాలలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు కొనసాగుతుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఈ కాలపరిమితులు కొనసాగుతాయని కూడా తెలిపింది. కాబట్టి దయచేసి ఆందోళనతో బుకింగ్ చేయవద్దని వినియోగదారుల్ని కోరింది. డిమాండ్‌ను తీర్చడానికి తగినంత ఎల్పీజీ అందుబాటులో ఉందని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఇకపై కూడా గతంలో లాగే గ్యాస్ బుకింగ్స్ చేసుకోవచ్చనేది వీటి సారాంశం.

అంతకు ముందు పీఎం ఉజ్వల్ యోజన కనెక్షన్లకు 45 రోజులు, నాన్-పీఎం ఉజ్వల్ యోజన సింగిల్ బాటిల్ కనెక్షన్లకు 25 రోజులు, నాన్-పీఎంయూవై డబుల్ బాటిల్ కనెక్షన్లకు 35 రోజులుగా ఈ మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, అటువంటి మార్పులేవీ జరగలేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుత రీఫిల్ బుకింగ్ గడువులలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+