కొనసాగుతున్న తెలంగాణ బంద్: డిపోల్లోనే బస్సులు

హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లు ఆమోదానికి నిరసనగా తెలంగాణ రాజకీయ జెఏసి, వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా శనివారం బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మద్దతు తెలిపింది. పది జిల్లాల్లోనూ రోడ్లపై బైఠాయించి అఖిలపక్షం నాయకులు నిరసన తెలుపుతున్నారు.

Polavaram: Telangana bandh

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు తెరచుకోలేదు. హైదరాబాద్ ఎంజిబిస్‌లో బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజిబిఎస్, జెబిఎస్‌ల ఎదుట సిపిఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎంజిబిఎస్‌కు తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాకపోకలు సాగించే బస్సులు నిలిచిపోయాయి.

పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ ఖమ్మం డిపో ఎదుట వామపక్షాలు ధర్నా చేపట్టాయి. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి బస్ డిపో ఎదుట టిజెఏసి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

Polavaram: Telangana bandh

నల్గొండ బస్ డిపో ఎదుట కూడా తెలంగాణ రాజకీయ జెఏసి నేతలు ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని అన్ని డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. పది జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కాగా, హైదరాబాద్‌లో పలు లోకల్ బస్సులు నడుస్తున్నాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు తెరచుకోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+