వారు భయపడరా: చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
పత్తికొండ: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కమిషన్లకు ఆశపడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
శుక్రవారం ప్రజాసంకల్పయాత్రలో ఆయన పత్తికొండలో మాట్లాడారు. అంచనాలను 16 వేల కోట్ల నుంచి 55 వేల కోట్ల రూపాయలకు పెంచేశారని, అవినీతి వల్లనే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆయన అన్నారు.

స్కాములు చూసి భయపడరా..
స్కాములు చూసి కేంద్రం గానీ, అధికారులు గానీ భయపడరా అని జగన్ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ అన్నారు. నచ్చినవారికి చంద్రబాబు టెండర్లు ఇచ్చుకునేందుకు హంగామా చేస్తున్నారని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచిన రెండు వారాల వరకు కూడా వెబ్‌సైట్లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

అలా చూపుతున్నారు...
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపుతున్నారని జగన్ అన్నారు. కేంద్రం రాసిన లేఖను బూచిగా చూపుతున్నారని విమర్శించారు.

నాలుగేళ్లవుతోందని జగన్
చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు అవుతుందని, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా అని జగన్ అన్నారు. మళ్లీ మనకు ఎన్నికలు వచ్చేసరికి మనకు ఎలాంటి నాయకుడు కావాలని మన మనస్సాక్షిని అడగాలని అన్నారు. మోసాలు చేసే నాయకుడు, అబద్ధాలు చెప్పే నాయకుడు కావాలా అనేది మీరే ఆలోచించుకోవాలని సూచించారు.

చంద్రబాబు పాలనలో అంతా అవినీతే...
చంద్రబాబు ప్రభుత్వంలో అంతా అవినీతేనని జగన్ వ్యాఖ్యానించారు. 23వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ ఊరువాకిలి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

జగన్ తీవ్ర వ్యాఖ్యలు
రాష్ట్రంలో చట్టం లేదు, నాయ్యం లేదని, పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. 20 కోట్లు నుంచి 30 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కొన్ని చానళ్లు, పేపర్లు తోడుగా ఉన్నాయని అన్నారు.

అడ్డంగా దొరికినా కూడా...
ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పదవి నుంచి తప్పుకోరు, జైలుకు కూడా వెళ్లరని జగన్ వ్యాఖ్యానించరు. జన్మభూమి కమిటీలు అన్ని గ్రామ మాఫియాలుగా తయారు అయ్యాయని అన్నారు. గ్రామాల్లో మట్టి నుంచి ఇసుక దాకా దోచేస్తున్నారని ధ్వజమెత్తారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications