భూమా అఖిల ప్రియ దంపతుల అరెస్ట్ - ఉద్రిక్తత..!!
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసారు. అఖిలో పాటుగా భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లోకేష్ యువగళం పాదయాత్ర వేళ పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి పై అఖిల ప్రియ వర్గం దాడి చేసింది. ఈ దాడిలో సుబ్బారెడ్డికి గాయాలయ్యాయి. దీని పైన సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అఖిలతో పాటుగా 11 మంది పై పోలీసులు కేసు నమోదు చేసి చేసారు. దాడి వ్యవహారాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది.
అఖిల తో సహా భర్త అరెస్ట్:గత కొంత కాలంగా అఖిల ప్రియ..ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి అత్యంత ఆప్తుడు. రాజకీయంగా, ఆర్దికంగా ఇద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకునేవారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబ సభ్యులతో సుబ్బారెడ్డికి విభేదాలు ఏర్పడ్డాయి. సుబ్బారెడ్డి గత ఎన్నికల్లోనే నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, సాధ్యపడలేదు. ఆస్తులకు సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ మధ్య ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేయడాన్ని కూడా కడప జిల్లా పోలీసులు గుర్తించిన కేసులు పెట్టటం సంచలనంగా మారింది. ఆ సమయం నుంచి రెండు వర్గాల మధ్య పోరు తారా స్థాయికి చేరింది.

సుబ్బారెడ్డి పై దాడి:మంగళవారం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై.. అఖిల ప్రియ వర్గీయులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీని పైన ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అఖిలతో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఉదయాన్నే ఆళ్లగడ్డలోని అఖిల ప్రియ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి అరెస్ట్ చేశారు. అఖిల ప్రియతో పాటు వారి పైన హత్యయత్నం కేసులు పెట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు అసలేం జరిగిందని ఆరాతీసి ఇవాళ ఉదయమే అఖిలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
టీడీపీ హైకమాండ్ సీరియస్:లోకేష్ పాదయత్ర సమయంలో తన బలం చాటుకొనేందుకు సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అఖిల వర్గం దాడికి దిగింది. పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ నేతలు యాత్ర వేళ దాడులకు దిగటాన్ని సీరియస్ గా తీసుకుంది. ఆళ్లగడ్డ, నంద్యాలలో చోటు చేసుకుంటున్న పరిణామాల పై పార్టీ నాయకత్వం సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న క్రమంలో చోటు చేసుకుంటున్న ఈ దాడులు..వర్గ పోరు పైన టీడీపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications