శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ద్రరాత్రి కూన రవికుమార్ అరెస్ట్ - పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు : అచ్చెన్న ఆగ్రహం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్‌ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం టౌన్ శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి నివాసంలో నిద్రిస్తుండగా పోలీసులు ఇంటి చుట్టూ మోహరించిన మరీ అదుపులోకి తీసుకున్నారు.

వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో

వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలతో

శనివారం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య పై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో నిరసన కోసం బయలుదేరిన సమయంలో హౌస్ అరెస్టు చేయడానికి వచ్చి పోలీసులపై దురుసుగా వ్యవహరించారని, టూ టౌన్ సిఐ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినట్లు సమాచారం. రవికుమార్ ను అరెస్టు చేసి ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. అర్థ రాత్రి పూట రవికుమార్ ఇంతటితో పాటు, ఆయన సోదరుడు కూన సత్యారావు ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు.

పక్కా సమాచారంతో అరెస్ట్

పక్కా సమాచారంతో అరెస్ట్

కూన రవికుమార్ ఇంట్లో వున్నారన్న పక్కా సమాచారంతో అరెస్టు చేసిన పోలీసులు. అయితే ఇలా అర్ధ రాత్రి పూట వందల మంది పోలీసులతో ఇళ్లల్లోకి చొరబడి అరెస్టులు చేయడంపై ఆ కుటుంబం సభ్యులు మండి పడుతున్నారు. అర్థరాత్రి రెండువందల మంది పోలీసులతో వెళ్లి కూన రవికుమార్ ను అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏంట టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తలుపులు పగల గొట్టి ఇంట్లోకి చొరబడటం ఈ అరాచకానికి అద్దంపడుతోందని... రవికుమార్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కావాలనే జగన్ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారన్నారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే..వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి వుందన్నారు. వరదలతో రాయలసీమ అతలాకుతలమై ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే దానిపై దృష్టిపెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలి, కార్యకర్తల్ని ఏవిధంగా హత్యలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలను అరెస్టులు చేస్తే వరదల్లో చనిపోయినవారు, నష్టపోయిన పంటలు తిరిగిరావు. దేశంలో జగన్ లాంటి డైవర్షన్ సీఎం ఎక్కడా లేరంటూ విమర్శించారు.

పతనం ప్రారంభమైందంటూ

పతనం ప్రారంభమైందంటూ

నిండు సభలో చేసిన తప్పులకు క్షమాపణలకు చెప్పకుండా వాఖ్యల పట్ల ఆందోళన చేసిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ పతనం ప్రారంభమై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్ని దాడులు, అక్రమ అరెస్టులు చేయించినా నీ సమయం మరో రెండున్నరేళ్లే అని గుర్తు పెట్టుకోమని హెచ్చరించారు. టీడీపీ వచ్చాక మీపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తే జైళ్లు కూడా సరిపోవంటూ అచ్చెన్న చెప్పుకొచ్చారు.

English summary
Police arrest TDP leader Kuna Ravi Kumar in mid night, TDP leaders protest on this arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X