విశాఖ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిని అరెస్ట్ చేసిన పోలీసులు .. మండిపడుతున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లిన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు .
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్లో విశాఖ 21 వ డివిజన్ లో రిగ్గింగ్ జరుగుతుందన్న సమాచారంతో టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఏపీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణయ్ గోపాల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.

ఈ క్రమంలో ఏయూ హై స్కూల్ పోలింగ్ బూత్ వద్ద అనుచరులతో బూత్ కి వెళ్ళిన వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఇక వైసీపీ శ్రేణులు గొడవలు సృష్టించడానికి వెలగపూడి రామకృష్ణ బాబు వచ్చారంటూ ఆందోళనకు దిగారు. టిడిపి కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్ద నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును, ఏపీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆందోళన చేస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేయకుండా టిడిపి నేతలను అరెస్ట్ చేయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబును అరెస్టు చేసే సమయంలో అక్కడ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని టిడిపి నాయకులు అంటున్నారు. టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని , వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు .












Click it and Unblock the Notifications