వ్యభిచారం ముఠా గుట్టురట్టు: ఐదుగురి అరెస్ట్
గుంటూరు: గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుంటురులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీపూజ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ నెంబర్ 103లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తలమని చెప్పి అద్దెకు దిగిన సానికొమ్ము వెంకట కొండారెడ్డి, కుమారిలు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా, ఈ విషయంపై గురువారం పోలీసులకు సమాచారం అందింది.

దీంతో గురువారం రాత్రి సమయంలో దాడి చేసిన పోలీసులు.. వెంకట కొండారెడ్డి, కుమారితోపాటు ఓ యువతిని, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు.
దారి దోపిడీ: నగదు, బంగారం అపహరణ
గుంటూరు జిల్లాలోని ముప్పాళ్ల మండలం దమ్మలపాడు అడ్డురోడ్డు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి అటువైపుగా వెళ్తున్న ఆటో, రెండు ద్విచక్ర వాహనాలను అడ్డగించి వారి వద్ద ఉన్న నగదు, నగలు దోచుకెళ్లారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications