వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడులు: నిర్వాహకులతోపాటు మహిళల అరెస్ట్
విశాఖపట్నం: జిల్లాలోని గోపాలపట్నంలో వ్యభిచారం గృహంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 వేలు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, విశాఖలో గతకొన్ని రోజులుగా వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతోంది. అధికారులు కఠినచర్యలు తీసుకున్నా నిర్వాహకులు వ్యభిచారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నారు.
ఆ గృహాల చుట్టుప్రక్కల నివాసముంటున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, నిర్వాహకులపై పాత కేసులేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణికి ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
రూ.లక్ష అసలైన నగదుకు గాను రూ.3 లక్షల విలువజేసే నకిలీ నోట్లు ఇస్తామంటూ కల్లూరు రైల్వే స్టేషన్ వద్ద బేరసారాలు ఆడే క్రమంలో రాజ్‌కుమార్, రామకృష్ణ, సురేంద్రబాబులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10 లక్షల విలువజేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
దంపతుల దారుణ హత్య
కృష్ణా జిల్లా విజయవాడ పటమటలంకలోని ఓ ఇంట్లో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. మునగపాటి గంగాధర్(55), వీరాంజమ్మ(48) ఇంట్లో హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. దోపిడీ దొంగలే దంపతులను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications