హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ కరెన్సీ ముఠా బరితెగింపు, ఎవరీ గౌడ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ కరెన్సీ చెలామణి చేసే ముఠా సభ్యుల చేతిలో కానిస్టేబుల్ హతమయ్యాడు. ఎస్‌ఐ కత్తిపోట్లకు గురై తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న సంఘటన శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత నగర శివారులోని శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో జరిగింది. రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన సంఘటనలో నిందితుడు ఒకడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు.

నకిలీ నోట్ల పంపిణీ కేసులో రెండునెలల క్రితం పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆరా తీస్తున్న సైబరాబాద్ పోలీసుల్లో కానిస్టేబుల్ ఒకరు బలయ్యారు. అప్రమత్తమైన ఎస్‌ఐ జరిపిన కాల్పుల్లో నిందుతుడు మృతి చెందగా ముఠా సభ్యులు పరారయ్యారు.

సుమారు రెండు నెలల క్రితం నకిలీ కరెన్సీ (నకిలీ నోట్లు) చెలామణి కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన కేంద్రంగా సిద్దిపేటలో కరెన్సీని తయారు చేస్తున్నారని గమనించిన సైబరాబాద్ పోలీసులు నకిలీ కరెన్సీ తయారీ ముఠాను పట్టుకునేందుకు ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

శామీర్ పేట

శామీర్ పేట

నకిలీ కరెన్సీ ముఠాను పట్టేసే బాధ్యతలు తీసుకున్న బాలనగర్ జోనల్ టాస్క్ఫోర్సు బృందం నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాలను గుర్తించి, కీలకమైన వ్యక్తులను పట్టుకోవాలని పథకాన్ని రూపొందించారు.

గాంధీ ఆసుపత్రి వద్ద కానిస్టేబుల్ మృతదేహం

గాంధీ ఆసుపత్రి వద్ద కానిస్టేబుల్ మృతదేహం

పథకం ప్రకారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ ఈశ్వరయ్య అలియాస్ ఈశ్వర్‌రావులు ముఠా సభ్యుల్లో ఒకరిగా చేరేందుకు నిర్ణయించుకున్నారు.

కానిస్టేబుల్ ఫ్యామిలీ కన్నీరుమున్నీరు

కానిస్టేబుల్ ఫ్యామిలీ కన్నీరుమున్నీరు

నకిలీ కరెన్సీ కొనుగోలుదారులుగా రంగ ప్రవేశం చేసిన వారు గత రెండు రోజులపాటు నకిలీ కరెన్సీ ముఠా సభ్యులతోనే కలసి ఉన్నారు.

కానిస్టేబుల్ ఫ్యామిలీ కన్నీరుమున్నారు

కానిస్టేబుల్ ఫ్యామిలీ కన్నీరుమున్నారు

తమకు కరెన్సీ కావాలంటూ పోలీసులు నమ్మబలకడంతో ఇరువురి మధ్య ఒప్పందం కుదిరి డబ్బులు ఇచ్చేందుకు ముఠా సభ్యులు రఘు, నందులు సిద్దిపేట నుండి ఒక వాహనంలో శామీర్‌పేట వైపు తీసుకొని వచ్చారు.

కానిస్టేబుల్

కానిస్టేబుల్

మజీద్‌పూర్ గ్రామానికి రాగానే డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న సమయంలో రఘు అనే వ్యక్తిని పక్కకు తీసుకు వెళ్లిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య మరెంతమంది దీని వెనక ఉన్నారంటూ ఆరా తీయడంతో అనుమానం వచ్చిన రఘు పోలీసులని గుర్తించాడు.

ఆసుపత్రిలో ఎస్సై

ఆసుపత్రిలో ఎస్సై

పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే హఠాత్తుగా ఒక బోలెరో వాహనంలో ఏడుగురి సభ్యుల ముఠా అక్కడుకు చేరుకుంది.

ఆసుపత్రిలో ఎస్సై

ఆసుపత్రిలో ఎస్సై

రెప్పపాటులో ముజఫర్ అలియాస్ ముస్తఫా అనే ముఠా సభ్యుడు వాహనం నుండి బయటకు దిగి ఈశ్వర్ అనే కానిస్టేబుల్‌పై కత్తితో గుండెల్లో పొడవడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్‌ఐ వెంకట్ రెడ్డిని సైతం అదే కత్తితో ముస్తఫా వెనుక నుంచి రెండు పోట్లు గట్టిగా పొడిచాడు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

వెంటనే అప్రమత్తమైన ఎస్‌ఐ వెంకట్ రెడ్డి సర్వీసు రివాల్వర్‌తో ముస్తఫా పైనకాల్పులు జరపడంతో నిందితుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

సిద్దిపేట నుండి పోలీసులతో వచ్చిన నందు, రఘు చెట్ల పోదల్లో నుండి పారిపోగా బొలెరోలో వచ్చిన ముఠా సభ్యులు అదే వాహనంలో పరారయ్యారు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుల్ ఈశ్వరయ్యలను చికిత్స నిమిత్తం అల్వాల్‌లోని ఆక్సిజన్ ఆసుపత్రికి తరలించారు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

అప్పటికే కానిస్టేబుల్ ఈశ్వరయ్య మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం ఎస్‌ఐ వెంకట్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

నిందితుల కోసం సైబరాబాద్ పోలీసులు బలగాలను రంగంలోకి దింపారు. చెక్‌పోస్టు వద్ద నిందితులు రఘు, నందు అలియాస్ నరేష్‌లను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలు పెట్టారు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

నిందితుల సమాచారం మేరకు సంఘటన స్థలం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు లక్షన్నర నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

శామిర్ పేటలోని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న దృశ్యం.

సంఘటన స్థలంలో నిందితులు వినియోగించిన కత్తితో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి వినియోగించిన సర్వీసు రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముస్తఫా వాడిన కత్తి

ముస్తఫా వాడిన కత్తి

సంఘటన స్థలంలో పోలీస్ కాల్పులకు మృతి చెందిన ముస్తఫా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మృతి చటెందిన ముస్తఫా

మృతి చటెందిన ముస్తఫా

శామీర్‌పేటలోని మసీద్‌పురా వద్ద పోలీసులు వేసిన వల నుంచి దొంగనోట్ల ముఠా నాయకుడు ఎల్లాగౌడ్‌ తప్పించుకున్నాడంటున్నారు.

మృతి చెందిన ముస్తఫా

మృతి చెందిన ముస్తఫా

ఎల్లాగౌడ్‌ రెండు నెలల క్రితమే బీదర్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతడిపై నల్లగొండ, సిద్దిపేట, హుజూరాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలో పలు కేసులు ఉన్నాయి.

యెల్లం గౌడ్

యెల్లం గౌడ్

గడచిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఎల్లా గౌడ్ ఓ పార్టీ నుంచి కౌన్సిలర్‌ టికెట్‌ ఆశించాడని సమాచారం. ఎల్లాగౌడ్‌ నకిలీ సామ్రాజ్యమంతా సిద్దిపేట కేంద్రంగా నడుస్తోంది.

ఎల్లం గౌడ్

ఎల్లం గౌడ్

కాగా, నకిలీ కరెన్సీ ముఠా జరిపిన దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్‌ ఈశ్వర్‌ కుమార్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హామీ ఇచ్చారు.

ఎల్లం గౌడ్

ఎల్లం గౌడ్

ముఖ్యమంత్రితో చర్చించి అతడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. అనంతరం ఎస్‌ఐ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఠా సభ్యులను పక్కా ప్రణాళికతో అరెస్టు చేయడానికి యత్నించిన పోలీసులపై దుండగులు కత్తులతో దాడి చేయడంతో కానిస్టేబుల్‌ ఈశ్వర్‌కుమార్‌ మృతి చెందడం బాధాకరమన్నారు.

English summary
A constable and a gangster were killed and a sub-inspector was critically injured in a clash between the police and fake currency racketeers in Shamirpet on Friday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X