తిరుపతిలో హై అలర్ట్, ఆటమొదలైయ్యింది, ఆరోజు రానే వచ్చేసింది, పొలిటికల్ లీడర్స్ !
ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల క్రితమే 175 అసెంబ్లీ నియోజక వర్గాలు, 25 లోక్ సభ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి వేసవిని తలపిస్తోంది. ముఖ్యంగా ఏడు కొండల స్వామి కొలువుతీరిన తిరుపతిలో ఎండ ఎంత విపరీతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అలాంటి తిరుపతిలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితలు నెలకొన్నాయి.
తిరుపతిలోని శ్రీ పద్మావతి యూనివర్శిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడులు జరగడంతో తిరుపతితో పాటు చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతిలో ఇప్పటికే అదనపు పోలీసు బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నిల హడావిడికి తోడు తిరుపతి నగరంలో ఇప్పుడు గంగజాతర మొదలైయ్యింది. తిరుపతి గంగ జాతర గురించి రాయలసీమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలోని తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తిరుపతి గంగజాతర జరిగే సమయంలో ప్రతి సంవత్సరం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు పోలింగ్ పూర్తి అయిన సమయంలోనే జరుగుతున్న గంగజాతర విషయంలో తిరుపతి జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుపతిలో గంగమ్మ జాతర మొదలు కావడంతో నగరం మొత్తం పండుగ వాతరం నెలొనింది. తిరుపతి గంగమ్మ జాతర మొదలైన మొదటి రోజు రోజు బైరాగి వేషంలో చిన్నారులు అలరించారు. గంగమ్మ జాతర మొదలైన ఉదయం నుంచే తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భక్తులు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. తిరుపతి గంగజాతర సందర్బంగా మొదటి రోజు భైరాగి వేశంలో పలువురు భక్తులు గంగమ్మ గుడి దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తిరుపతిలో మామూలుగానే వేడి విపరీతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో భైరాగి వేషదారణలు వేసుకున్న భక్తులు ఉదయం నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు గంగమ్మ గుడి దగ్గరకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ విపరీతంగా పెరిగిపోవడంతో భైరాగి వేషాలు వేసి గంగమ్మ దగ్గర మొక్కులు తీర్చుకోవాలని అనుకున్న భక్తులు సాయంత్రం నుంచి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications