వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీమంత్రి పరిటాల సునీత, తనయుడు పరిటాల శ్రీరామ్ లపై పోలీస్ కేసులు నమోదు.. రీజన్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

అనంతపురం జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై విరుచుకుపడిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత మరియు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పై అనంతపురం జిల్లాలోని రాప్తాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఏం చదువుకున్నాడో తెలియని జగన్ కు చట్టాల గురించి ఏం తెలుసు: లోకేష్ ఘాటు వ్యాఖ్యలుఏం చదువుకున్నాడో తెలియని జగన్ కు చట్టాల గురించి ఏం తెలుసు: లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

 30 పోలీస్ యాక్ట్ అమలులో.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నిరసన ర్యాలీ..

30 పోలీస్ యాక్ట్ అమలులో.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నిరసన ర్యాలీ..

ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే నిబంధనలకు విరుద్ధంగా రాప్తాడు లో ర్యాలీ నిర్వహించి నందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు లో ఉందని, అనుమతులు లేకుండా ఎటువంటి సమావేశాలు, సభలు నిర్వహించడానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. టీడీపీ నేతలు నిర్వహించిన నిరసన ర్యాలీకి పోలీసుల నుండి అనుమతి లేదని వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ నిబంధనలను పట్టించుకోకుండా రాప్తాడులో జాతీయ రహదారిపై టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ర్యాలీ నిర్వహించారు అని పోలీసులు వెల్లడించారు.

 వివిధ సెక్షన్ల క్రింద మొత్తం 39 మందిపై కేసు నమోదు

వివిధ సెక్షన్ల క్రింద మొత్తం 39 మందిపై కేసు నమోదు

అంతేకాకుండా స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రసంగాలు సైతం చేశారని పోలీసులు పేర్కొన్నారు. టిడిపి నేతలు చేపట్టిన ర్యాలీ వల్ల జాతీయ రహదారిపై భారీగా వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగిందని పోలీసులు వెల్లడించారు .దీంతో పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ లతో పాటు టిడిపి నేతలపై పోలీస్ కేసులు నమోదు చేసినట్లు గా పేర్కొన్నారు. మొత్తం 39 మందిపై 143, 341, 188 R/w, 34 ipc సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 జాకీ పరిశ్రమ తరలిపోవటంపై పరిటాల సునీత ఆందోళన.. ఎమ్మెల్యే టార్గెట్ గా వ్యాఖ్యలు

జాకీ పరిశ్రమ తరలిపోవటంపై పరిటాల సునీత ఆందోళన.. ఎమ్మెల్యే టార్గెట్ గా వ్యాఖ్యలు


నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించి, ప్రసంగించిన నాయకులు అందరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు, టిడిపి నాయకులతో పాటు సిపిఐ నాయకులు రామకృష్ణ పై కూడా కేసు నమోదు చేశారు. రాప్తాడు నుండి జాకీ పరిశ్రమ తరలి పోవడాన్ని నిరసిస్తూ టిడిపి నేతలు ఆందోళన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కారణంగానే జాకీ పరిశ్రమ తరలి పోయిందని, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణలు గుప్పించారు.

పరిటాల సునీత ఆందోళనతో టీడీపీ నాయకులపై కేసులు నమోదు

పరిటాల సునీత ఆందోళనతో టీడీపీ నాయకులపై కేసులు నమోదు


ఈ క్రమంలోనే జాకీ పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం నుండి రాప్తాడు తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడిన పరిటాల సునీత వైసిపి నేతల ఆగడాలకు తెలుగుదేశం పార్టీ పాలనలో వచ్చిన కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆందోళన నేపథ్యంలోనే టీడీపీ నాయకుల పై కేసులు నమోదయ్యాయి.

English summary
Cases registered against former minister Paritala Sunita and Paritala Sriram at the Raptadu police station. Police have registered cases against 39 people, including Sunita and Sriram, for holding a rally against the provisions of the 30 Police Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X