పిన్నెళ్లి ఎక్కడున్నారు - ఏం జరుగుతోంది..!!
వైసీపీ నేత పిన్నెళ్లి రాష్ట్రంలో కలకలంగా మారింది. ఈవీఎం ధ్వంసం కేసులో పలు సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. పిన్నెళ్లి తమ పార్టీ శ్రేణుల పైన చేసిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని టీడీపీ నిర్ణయించింది. ఛలో మాచర్లకు పిలుపునిచ్చింది. అయితే ఛలో మాచర్లకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పిన్నెళ్లి అరెస్ట్ పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
పిన్నెళ్లి ఎక్కడ
పిన్నెళ్లి ఎపిసోడ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఛలో మాచర్లకు తెలుగుదేశం గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. ఛలో మాచర్ల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుచర్యగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు జూలకంటి బ్రహ్మరెడ్డి, కనపర్తి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఛలో మాచర్ల
వైసీపీ గూండాల దాడిలో గాయపడిన తమ కార్యకర్తలను కూడా పరామర్శ చేయనీయరా అంటూ మండిపడుతున్నారు. పిన్నెళ్లి అరెస్ట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తన అరెస్టు అనివార్యమని భావించిన పిన్నెల్లి మరోసారి పోలీసు ల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తెలంగాణలో వారిని అరెస్ట్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే పిన్నెల్లి సోదరుల జాడ తెలియరాలేదు. పోలీసుల కదలికలను పిన్నెల్లికి చేరవేస్తున్నది ఎవరనే చర్చ మొదలైంది. ఈవీఎం ధ్వంసంతో పాటు ఎమ్మెల్యేపై మరో హత్యాయత్నం కేసు కూడా నమోదైంది.
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
ఇటు వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ పైన ఆచితూచి స్పందిస్తోంది. పిన్నెళ్లి ఈవీఎం ధ్వంసం చేయటానికి ముందు అక్కడ టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తోంది. పోలింగ్ రోజు నాడు ఈవీఎం ధ్వంసం చేస్తే వీడియో ఇప్పుడు బయటకు రావటం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పైన టీడీపీ పూర్తిగా అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు పిన్నెళ్లి అంశం పైనే చర్చ సాగుతోంది. దీంతో..అసలు పిన్నెళ్లి ఎక్కడ ఉన్నారు...పోలీసులు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications