పీతల సుజాత ఇష్యూలో ట్విస్ట్: ఆమె ఏం చెప్పారు?
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మంత్రి పీతల సుజాత తండ్రి బాబ్జి నివాసం వద్ద దొరికిన డబ్బుల సంచి వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. మహిళ వదిలి వెళ్లిన నగదు బ్యాగుతో తనకు సంబంధం లేదని మంత్రి పీతల సుజాత చెప్పారు.
తన తండ్రి ఇంటికి వచ్చిన మహిళకు మతిస్థిమితం లేనట్టుందని ఆమె చెప్పారు. అదే సమయంలో శుభలేక ఇచ్చేందుకు వచ్చి మరిచిపోయి ఉంటారని చెబుతున్నారు.
తమ ఇంటి ముందుకు పదిలక్షల రూపాయలు ఎలా వచ్చాయో తెలియదని చెప్పారు. ఆ మహిళ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పారు.
ఇదిలా ఉండగా, తాను మంత్రి తండ్రిని కలిసేందుకు వచ్చానని రిటైర్డ్ హాస్టల్ వార్డెన్ అయిన విష్ణువతి చెప్పినట్లుగా తెలుస్తోంది. తన తమ్ముడి కుమార్తె పెళ్లి కోసం డబ్బులను పాలకొల్లు ఎస్‌బీఐలో డ్రా చేసినట్లు చెప్పారు. ఆ డబ్బుల బ్యాగ్‌ను మరిచిపోయినట్లు చెప్పారని సమాచారం.

కాగా, విష్ణువతి, శ్రీలక్ష్మిలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు విష్ణువతిని విచారిస్తున్నారు. కాగా, విష్ణువతి మంత్రి పీతల సుజాత నివాసం వద్ద వదిలినట్లుగా భావిస్తున్న సంచిలో రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. మంత్రి హౌస్ కీపర్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications