సజ్జల అరెస్ట్ కు రంగం సిద్దం...!!

ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో పలువురు వైసీపీ ముఖ్యులకు నోటీసులు జారీ చేసారు. కొందరిని అరెస్ట్ చేసారు. తాజాగా పులివెందుల కు చెందిన వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు అర్జున్‌రెడ్డికి పోలీసులు 41-ఏ నోటీసులు జారీ చేసారు.

నోటీసుల జారీ
సోషల్ మీడియా పోస్టింగ్స్ కేసులో సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిని రేపు (సోమవారం) విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసారు. వీరితో పాటు మరికొంత మంది వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..వారిని సైతం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వర్రా రవీందర్ రెడ్డి అసభ్య పోస్టింగ్స్ చేసారంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్ రెడ్డి విచారణ సమయంలో పలువురి వైసీపీ ముఖ్య నేతల పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో , ప్రస్తుతం పోలీసులు వారిని విచారణ కు రావాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు.

Police issues 41 A notices for Sajjala Bhargav Reddy in social media postings

పోలీసుల విచారణలో
ఈ కేసులో A1గా వర్రా రవీందర్‌రెడ్డి, A2గా సజ్జల భార్గవరెడ్డి, A3 అర్జున్‌రెడ్డిల పేర్లు చేర్చారు. అయితే ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌ మీద కడప జైలుకు తరలించారు. ఇక, ఇప్పుడు భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ వెళ్లిన పోలీసులు ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో సజ్జల భార్గవ్‌ తల్లికి నోటీసులు అందజేశారు. అదే సమయంలో అర్జున్‌రెడ్డికి కూడా పోలీసులు 41-A నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టుల్లో సజ్జల భార్గవ్ రెడ్డి కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. తాజా కేసులో ఆయన్ను విచారించి అరెస్ట్ చేయాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అరెస్ట్ ఖాయమంటూ
సజ్జల భార్గవ్ రెడ్డి 2022 లో వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాతనే సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల పైన భార్గవ్ సూచనల మేరకే పోస్టులు పెట్టినట్లు వర్రా రవీందర్ రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పటంతో వీరి పైన పోలీసులు ఫోకస్ చేసారు. తాజా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8న నమోదైన ఐటీ, బీఎన్ఎస్, అట్రాసిటీ యాక్ట్ కింద ఈ ముగ్గురుపైన కేసులు నమోదయ్యాయి. వర్రా రవీందర్‌రెడ్డి పైన కడప జిల్లాలో పది కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. దీంతో, వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చూసిన భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+