పిన్నెల్లి సోదరులకు షాకింగ్ ట్రీట్మెంట్ మొదలు..!!
వైసీపీ మాచర్ల నేతలు పిన్నెల్లి సోదరులకు ట్రీట్మెంట్ మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ కాలంలో చోటు చేసుకున్న దాడుల వెనుక పిన్నెల్లి సోదరుల పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల పోలింగ్ సమయంలోనూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసారు. ఇప్పుడు పిన్నెల్లి సోదరుల పైన మాచర్ల పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు సమాచారం.
రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఎన్నికల రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం చేశారు. టీడీపీ ఏజెంట్ నంబూరు శేషగిరిరావుపై దాడి చేశారు. ఆ మరుసటిరోజు కారంపూడిలో వందల సంఖ్యలో అల్లరి మూకలను వెంటబెట్టుకు రోడ్లపై స్వైరవిహారం చేశారు. జనాలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనలలో పాల్గొన్న పిన్నెల్లి సోదరులు, వెసీపీ రౌడీమూకలపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై మాచర్ల పట్టణ పోలీసులు సమాచార ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ కొనసాగుతుండగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై అనుచరులతో దాడిచేయించారు. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసులు నమోదు కాగా, ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు.












Click it and Unblock the Notifications