వ్యభిచార గృహంపై దాడి: మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడు అరెస్ట్
ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించిన తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు.. ఓ మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడుతోపాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు యువతులను హోంకు తరలించారు.
చిత్తూరు: ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించిన తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి పోలీసులు.. ఓ మహిళా ఎస్ఐ తల్లి, తమ్ముడుతోపాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు యువతులను హోంకు తరలించారు. ఆ మహిళా ఎస్ఐకి ఏడాది కిందటే వివాహం కావడంతో ఆమె భర్తతో కలిసి వేరుగా జీవిస్తోంది.
అయితే, ఆ ఎస్ఐ తల్లి, తమ్ముడు ఎంఆర్‌పల్లి సమీపంలోని ధనలక్ష్మినగర్‌లో నివాసం ఉంటున్నారు. వారు వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ర్యాగింగ్‌కు యువకుడు బలి
సీనియర్ల వేధింపులు తాళలేక నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు చనిపోయాడనే విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామంలోని ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రదీప్ చదువుతున్నాడు. ప్రదీప్ తల్లిదండ్రులు పెంచలయ్య, లక్ష్మీలు అనంతసాగర్ మండలంలోని శంకర్ నగర్ గ్రామంలో ఉంటున్నారు. ప్రదీప్ తండ్రి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ ను .. తన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని తల్లి దండ్రులకు తెలిపాడు.
బీరు బాటిల్స్, బిర్యానీలు కావాలని నిత్యం వేధిస్తున్నారని వాపోయాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా.. ఫోన్ అమ్మి అయినా తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారని తన తల్లిదండ్రులకు చెప్పి బాధపడేవాడు. ఎవరెవరు ర్యాగింగ్ చేస్తున్నారో వారి పేర్లు అడిగినా భయపడి చెప్పలేదని తల్లిదండ్రులు తెలిపారు.
ఇంటికి కూడా వెళ్లకూడదని చెప్పి చిత్ర హింసలు పెట్టి.. తమ కుమారుడిని చనిపోయేలా చేశారని మండిపడ్డారు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేకే.. రైలు కిందపడిచనిపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications