విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Crime News: రమ్మన్నారు.. గొంతు కోసి చంపేశారు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

|
Google Oneindia TeluguNews

సాధారణంగా రెండు కారణాలతో నేరాలు ఎక్కువగా జరుగుతాయి. అందులో ఒటకి మనీ అయితే మరొటి మగువ. తాజాగా విశాఖపట్నంలోని హత్యకు గురైన టీఏఎస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్ వివాహేతర సంబంధం కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల్లో ఒకరు బాలుడు కావడంతో అతడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

అస్సలు ఏం జరిగిందంటే..

అస్సలు ఏం జరిగిందంటే..

విశాఖపట్నంలోని టీఏఎస్‌ ఇంజినీరింగ్‌ కంపెనీలో సిద్ధార్థ శంకర్‌ పట్నాయక్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఫ్యామిలీతో కలిసి మింది గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలో ఉన్న యడ్ల ఈశ్వరమ్మతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది.శంకర్ పట్నాయక్ ఈశ్వరమ్మ దగ్గర రూ.5 లక్షల అప్పు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత దానికి వడ్డీ కలిసి మొత్తం రూ.7లక్షల వరకు చెల్లించాల్సి వచ్చింది.

వారికి తెలిసిపోయింది

వారికి తెలిసిపోయింది

అయితే బాకీ తీర్చాలని ఈశ్వరమ్మ గట్టిగా అడగలేకపోతోంది. అడిగితే తమ విషయం ఎక్కడ బయటపడుతుందని ఆమె సుతిమెత్తగా అతడిని డబ్బులు అడిగేది. అయితే ఈవిషయం ఈశ్వరమ్మపెద్ద కుమారుడైన యడ్ల గౌరీ శంకర్, చిన్న కుమారుడికి తెలిసిపోయింది. వారు అమ్మను వారించి.. డబ్బులు తిరిగిచ్చేయాలని శంకర్‌ పట్నాయక్ ను అడిగారు. అయితే శంకర్ డబ్బులివ్వను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మీ అమ్మతో వివాహేతర సంబంధం ఉందని మాట్లాడారు.

తాగిన మైకంలో

తాగిన మైకంలో

అవమానంగా ఫీల్ అయిన ఈశ్వరమ్మ కుమారులు శంకర్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. జూలై 25న తమ ఇంటికి పిలిచి.. అతడికి మద్యం తాగిపించారు. తాగిన మైకంలో ఉన్న శంకర్‌ గొంతు, చేతి మణికట్టుపై కోసి హత్య చేశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్‌ మీద తీసుకెళ్లి జింక్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న పొదల్లో పడేశారు. పట్నాయక్ మృతదేహం జూలై 26న కనిపించడంతో కేసు నమోదు చేసుకున్న విచారణ చేపట్టారు.

గొడవ

గొడవ

పోలీసులు మింది గ్రామంలో విచారించారు. పట్నాయక్, ఈశ్వరమ్మ కుటుంబానికి గొడవ జరిగినట్లు తెలుసున్నారు. దీంతో ఈశ్వరమ్మ ఇంటికెళ్లి పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేశామని ఒప్పుకున్నారు. డబ్బులు ఇవ్వకపోడవం, తమను అవమానం పర్చడం వల్లే శంకర్ పట్నాయక్ చంపినట్లు వారు తెలిపారు.

English summary
Police have arrested the accused in Shankar Patnaik's murder case in Visakhapatnam. It was concluded that extramarital affair was the reason for the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X