అనినాశ్ కు ఊహించని పరాభవం..!!
వైసీపీ నేత దేవినేని అవినాశ్ కు చేదు అనుభవం ఎదురైంది. అవినాశ్ పైన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నమోదైంది. ఆయన పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అవినాశ్ తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. విమానాశ్రయ అధికారులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనతో అవినాశ్ విదేశీ పర్యటనకు విమానాశ్రయ అధికారులు నిరాకరించారు.
అవినాశ్ పై కేసు
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్ నిందితుడిగా ఉన్నారు. మూడేళ్ల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విధ్వంసానికి అవినాష్ ప్రధాన నిందితుడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఆయన దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

దాడుల వెనుక
2021 అక్టోబరు 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ అరాచకమూకలు దాడికి తెగబడ్డాయి. వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి, వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్‌ల ఆధ్వర్యం లో వారి అనుచరులే ఈ దాడికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో గుంటూరు నుంచి పెద్దసంఖ్యలో వైసీపీ మద్దతు దారులు దాడికి తెగబడ్డారని ఆరోపణలు వచ్చాయి.
విచారణ
ఈ కేసులో పలువురు నేతలు ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దేవినేని అవినాశ్ పైన ఈ కేసు నమోదై ఉంది. ఇప్పుడు అవినాశ్ విదేశాలకు వెళ్తున్న సమయంల లుకౌట్ నోటీసుల ద్వారా అడ్డుకున్నారు. అటు చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ కేసుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications