టీడీపీ కార్యాలయంపై దాడి కేసు రీ ఓపెన్ - వైసీపీ నేతలకు ఉచ్చు..!!
ఏపీలో జరిగిన రాజకీయ దాడుల పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. వైసీపీ హాయంలో జరిగిన రాజకీయ దాడుల పైన నమోదైన కేసులపై వివరాలు కోరింది. అందులో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం.. చంద్రబాబు ఇంటి పైన దాడుల ఘటన కేసులను రీ ఓపెన్ చేస్తోంది. టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దాడి జరిగిన సమయంలో ఆఫీసులోని ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు.
కొత్త ప్రభుత్వం గత అయిదేళ్ల కాలంలో జరిగిన దాడుల కేసుల పైన వివరాలు కోరింది. రాజకీయ దురుద్దేశంతో చోటు చేసుకున్న ఘటన పైన సీరియస్ గా స్పందిస్తోంది. మూడేళ్ల క్రితం టీడీపీ రాష్ట్ర కార్యాలయం పైన జరిగిన దాడి కేసును తిరిగి విచారిస్తున్నారు. దీని కోసం రిగిన సమయంలో ఆఫీసులోని ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. కొంత ఫుటేజ్‌ని తమతో అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై కీలక నిందితులుగా భావిస్తున్నవారిని రెండు రోజుల్లో అరెస్టు చేేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన దాదాపు 200 మంది అల్లరి మూకలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్లు, ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ డ్యామేజ్ అయ్యింది. టీడీపీ ఆఫీసు వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు పోలీసుల విచారణలో బాధ్యతులను తేల్చనున్నారు.












Click it and Unblock the Notifications