
పవన్‌కు తానా ఆహ్వానం వెనుక ఉన్నదెవరు : అక్కడే అసలు రాజకీయం: మారుతున్న సమీకరణాలు..!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కేంద్రంలో..ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ..వైసీపీ తమకు తిరుగు లేదనే భావనతో తమ లెక్కలతో రాజకీయాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ బలం కోల్పోయింది. దీంతో..రాజకీయంగా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎన్నికల వేళ తాను ఎంతో మంది శత్రువులతో పోరాడుతున్నానంటూ చేసిన ప్రచారం సైతం చంద్రబాబు మీద విసుకు పుట్టించింది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు పాత బంధాలనే కొత్తగా ఏర్పరచుకుంటున్నారు.
Recommended Video


పవన్‌కు తానా ఆహ్వానం వెనుక..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అమెరికాలోని వాష్టింగ్టన్‌లో జరుగుతున్న తానా సభలకు ఆహ్వానం వచ్చింది. అది ఆయనకు సినిమా స్టార్‌గా కాకుండా..ఏపీలోని రాజకీయ పార్టీ అధినేతగా ఆహ్వానించారు. తానా నిర్వహాకులు అంతా తొలి నుండి టీడీపీ అనుబంధంగా పని చేసేవారే. తానాలో క్రియాశీలకంగా వ్యవహరించే వారిలో ఎక్కువగా టీడీపీకి అండగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉంటారు. అమెరికాకు టీడీపీ నేతలు వచ్చినా వారే అన్నీ దగ్గర ఉండి చూసుకుంటారు. ఇక, ఏపీలో ఎన్నికల వేళ సైతం తానా సభ్యులు టీడీపీకి పార్టీ ఆర్దికంగా సహాయ సహకా రాలు అందిస్తారనే వాదన ఉంది.ఇక, తానా సభలు ఎప్పుడు జరిగినా అందులో టీడీపీ నేతలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ సారి టీడీపీ నేతల సంఖ్య తక్కువగా కనిపించింది. అయితే, అనూహ్యంగా ఈ సారి తానా సంబరాల్లో బీజేపీ ముఖ్య నేత రాం మాధవ్.. పవన్ కళ్యాణ్ హాజరవ్వటం వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది.

పవన్ హాజరవ్వటంతో అసలు చర్చ...
పవన్ కళ్యాన్ తానా సభల్లో పాల్గొనటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. పవన్ సైతం తానా సభలకు తాను హాజరవ్వం వెనుక చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. కొందరు వెళ్లమని..మరి కొందరు వెళ్లవద్దని తన మీద ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. అయితే, తాను కులాలు..మాతాల పేరుతో విడదీయటానికి రాలేదని..కలపాలనే దే తన ఉద్దేశం అని స్పష్టం చేసారు. అదే సమయంలో ఎన్నికల్లో ఓటమి మీద కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటమి తనకు కొత్త కాదని..విజయ సాధించే వరకూ సహనంతో ఉంటానని వ్యాఖ్యానించారు. తానా వేదిక నుండి ముఖ్యమంత్రి జగన్ పైన పరోక్ష్య వ్యాఖ్యలు చేసారు. జైలు శిక్ష అనుభవించిన వారు హాయిగా ఉండగా..తాను ఓడితే మాత్రం అందరికీ దూరంగా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తన సుదీర్ఘ ప్రసంగంలో జగన్ గురించి పరోక్షంగా ప్రస్తావించిన పవన్ ..
ఎక్కడా టీడీపీ అధినేత చంద్రబాబు...ప్రధాని మోదీ గురించి మాత్రం మాట్లాడలేదు. పైగా ఇదే సమయంలో ఆయన బీజేపీ నేత రాం మాధవ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

పవన్ కళ్యాణ్..రాం మాధవ్ రాక వెనుక రాజకీయం..!
తానా సభలకు బీజేపీలు నేతలు ఎన్నడూ హాజరు కాలేదు. తొలి సారి రాంమాధవ్‌కు ఆహ్వానం అందింది. ఏపీలో మారు తున్న రాజకీయ సమీరణాలను దృష్టిలో పెట్టుకొనే కొందరు ప్రముఖలు సూచనల మేరకే రాం మాధవ్‌కు ఆహ్వానం పంపినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో బలపడాలనుకుంటున్న సమయంలో టీడీపీకి అండగా ఉండే తానా సభలకు రాం మాధవ్ వెళ్లటం సైతం రాజకీయ వ్యూహంలో భాగంగా చెబుతున్నారు. ఇక, వపన్ కళ్యాణ్‌ను టీడీపీ కి దగ్గర చేసే ప్రయత్నంలో భాగంగా ముందు అడుగు తానా సభలకు ఆహ్వానించారని విశ్లేషకుల అంచనా. ఇప్పుడు పవన్ సైతం రాజకీయంగా నిలదొక్కుకోగలగాలంటే..జగన్‌ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పొత్తు రాజకీయాలు తప్ప వనే అభిప్రాయం ఆ పార్టీ నేతలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యక్తిగతంగా పవన్ మాత్రం పొత్తు రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచన నుండి ప్రస్తుతానికి అయితే మార్పు లేదంటున్నారు. అయితే, జగన్ ప్రజాకర్షణను ఎదు ర్కోగలగాలంటే పవన్‌తో స్నేహం కావాల్సిందేనని టీడీపీ నేతలు అంచనాకు వచ్చారు. దీంతో..ఇప్పుడు తానా సభల ద్వారా మొదలైన ఆహ్వానాలు ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపాయి.