మంగళగిరిలో గెలుపెవరిది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు - తాజా సర్వే సంచలనం..!!
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. కీలక నేతల నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై ఆసక్తి పెరుగుతోంది, సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడి పోయిన టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి వచ్చే ఎన్నికల్లో అక్కడే నుంచే పోటీకి సిద్దం అవుతున్నారు. దీంతో, మంగళగిరిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది..ఎవరు గెలుస్తారనే లెక్కలతో తాజాగా పొలిటికల్ క్రిటిక్ సర్వే సంస్థ ఆసక్తికర అంచనాలను వెల్లడించింది.
లోకేశ్ భవిష్యత్ కు కీలకంగా: నారా లోకేశ్ కు ఈ సారి ఎన్నికల్లో గెలుపు కీలకం. పార్టీని గెలిపించుకొనేందుకు యువగళం యాత్ర ద్వారా ప్రజల్లో ఉన్న లోకేశ్, ఈ సారి ఎన్నికల్లో గెలిచి విమర్శలకు సమాధానం చెప్పాలని భావిస్తున్నారు. 2019 లో ఓటమి తరువాత తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించిన లోకేశ్, చాలా రోజులుకే అక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అమరావతి రాజధాని అంశం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రతీ గ్రామంలోనూ పర్యటనలు చేసారు. పెళ్లికానుక, ఆరోగ్య సేవల వంటి ద్వారా ఓటర్లకు దగ్గరయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు వైసీపీ సైతం స్థానిక సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పావులు కదిపింది. గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకొని రాష్ట్ర స్థాయి పదవి కేటాయించింది. మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీని చేసింది.
వైసీపీ వర్సస్ టీడీపీ హోరా హోరీ: 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో నారా లోకేశ్ పై విజయం సాధించారు. ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్ చేసిన సర్వే అంచనాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. మంగళగిరి లో అర్బన్ ఓటర్లు 1,47,904 ఉండగా, రూరల్ ఓటర్లు 1,20,525 మంది ఉన్నారు.

అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 44.15 శాతం, టీడీపీకి 44.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ఎన్డీఏ కు 04.85 శాతం, సీపీఐకు 03.17 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ద్వారా టీడీపీ స్వల్ప మెజార్టీ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, టీడీపీ నుంచి నారా లోకేశ్, వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీలో ఉంటే వచ్చే ఫలితాలుగా స్పష్టం చేసింది.
Constituency Wise Survey Results.
— Political Critic (@PCSurveysIndia) August 26, 2023
🔹️Mangalagiri: Andhrapradesh
Party wise, expected vote share:
YCP: 44.15%
TDP: 44.99%
NDA: 04.85%
CPI: 03.17%
Rural voters at Mangalagiri are approximately 120,525(~44.90%),
Urban voters are 147,904(~55.10%)
Slight edge to TDP pic.twitter.com/5IfqUyNjZr
సర్వేలో తేలిందేంటి: మంగళగిరిలో మొత్తం 278 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 61,470 ఎస్సీ ఓటర్లు, 8,778 మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ టీడీపీ, వైసీపీ హోరా హోరాగా చెరి సగం ఓట్లు దక్కించుకొనే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇదే సమయంలో ఎన్డీఏకు వచ్చే ఓటింగ్ శాతం ప్రత్యేకంగా పేర్కొంది.
సీపీఐ దక్కించుకొనే ఓట్లు ఇక్కడ అంచనాల మేరకు హోరా హోరీ పోరు సాగితే గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వే లెక్కల మేరకు స్పష్టం అవుతోంది. 2019 ఎన్నికల్లో సీపీఐకి 10,135 ఓట్లు రాగా, ఆర్కేకు దక్కిన మెజార్టీ 5,337 ఓట్లు. అయితే, వైసీపీ నుంచి ఆర్కే కాకుండా, బీసీ అభ్యర్ది బరిలోకి దిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే ఈ లెక్కలు మారటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఈ సంస్థ మంగళగిరి నియోజకవర్గంపై వెల్లడించిన ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications