భర్తతో దివ్వెల మాధురి.. మరి దువ్వాడ సంగతేంటి ..?

మాజీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ , దివ్వెల మాధురిల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. మాధురి తన భర్త మహేష్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్‌తో మాధురి కలిసి ఉన్నారు. గత ఎన్నికల తర్వాత శ్రీనివాస్ కొత్త ఇంటి వివాదంలో మాధురి జోక్యం చేసుకుని అది తన ఇల్లు అని పేర్కొనడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ అయ్యారు.

శ్రీనివాస్ తన భార్యతో కోర్టు వివాదం ముగిశాక పెళ్లి చేసుకుంటామని మాధురితో కలిసి చాలాసార్లు ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'వకులా చీరలు' పేరిట వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్-మాధురి ఎపిసోడ్ ప్రారంభమైనప్పుడు, మహేష్ తన భార్యపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఒక వీడియో విడుదల చేసి తర్వాత అదృశ్యమయ్యారు. ఇప్పుడు, సోషల్ మీడియాలో ఒక పాత వీడియో వైరల్ అవుతోంది.

Political Drama Former YSRCP Leader Duvvada Srinivas Shocked as Wife Madhuri Returns to her Husband

అందులో మాధురి తన భర్త మహేష్‌పై పూల వర్షం కురిపిస్తూ, 'జై మహేష్ బాబా' అంటూ కామెంట్లు చేశారు. ఆడపిల్లలను పుట్టిస్తాడని కూడా ఆమె పేర్కొన్నారు.అయితే, ఈ వీడియో తాజాది కాదని, దువ్వాడతో కలవక ముందు మాధురి తన భర్తతో ఉన్న పాత వీడియో అని తెలుస్తోంది. కానీ, కొందరు ఈ వీడియోను దువ్వాడ శ్రీనివాస్‌కు ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మాధురి తన భర్త మహేష్ వద్దకు తిరిగి చేరారని , దువ్వాడతో సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలపై దువ్వాడ శ్రీనివాస్‌ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+