గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారు - వైసీపీ ఎంపీటీసి కుటుంబ సభ్యులు : దుగ్గిరాల ఎన్నికల ఉత్కంఠ..!!

|
Google Oneindia TeluguNews

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి. గురువారం అక్కడ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను టీడీపీ - వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది టీడీపీ, ఒకటి జనసేన, 8 మంది వైసీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలిచారు. అయితే, ఎంపీపీ పదవి బీసీకి రిజర్వ్​ అయిన ఈ స్థానంలో రేపు ఎన్నిక జరగనుండగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

అత్యధిక స్థానాల్లో తెదేపా అభ్యర్థులు గెలుపొందినప్పటికీ.. వారిలో బీసీ అభ్యర్థి లేకపోవటంతో ఆ పార్టీ వ్యవహరించే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. దుగ్గిరాల 2 వైసీపీఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారంటూ పద్మావతి తనయుడు యోగేంధర్ నాథ్ ఆరోపించారు. పద్మావతి పార్టీ రెబల్ గా బరిలోకి దిగురారనే అనుమానంతో బలవంతంగా తీసుకెళ్లారని ఆమె తనయుడు ఆరోపిస్తున్నారు.

Political heat geared in Duggirala ahead of MPP Elections, allegations against MLA RK

నాలి వైపు తీసుకెళ్లారని చెబుతున్నారు. తనకు..తన తల్లికి ప్రాణహానీ ఉందని చెబుతూ.. ఇప్పటికే పలుమార్లు స్టేషన్‌కి పిలిచి మమ్మల్ని బెదిరించారని చెప్పకొచ్చారు. వైసీపీ నేతలు తమను అనేక రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎమ్మెల్యే ఆర్కే మాత్రం తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకోపోబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. గతంలో ఇక్కడ ఎన్నిక విషయంలో చెలరేగిన వివాదం అనేక మలుపులు తిరిగింది.

ఈ మండలంలో గెలిచిన జనసేన అభ్యర్ది టీడీపీకి మద్దతు ప్రకటించారు. అత్యధిక స్థానాలు గెలిచిన తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కే అవకాశముండటంతో చిలువూరు నుంచి గెలిచిన జబీన్​ను ఎంపీపీ అభ్యర్థిగా అప్పట్లోనే టీడీపీ ఖరారు చేసింది. అయితే, ఆ తరువాత జిల్లా స్థాయి అధికారులు జబీన్ బీసీ కాదని తేల్చారు. ఇక, ఇప్పుడు జరగుతున్న ఎన్నిక సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు

English summary
MLA RK YCP forcibly kidnapped the MPTC, Her family members' allegation ahead of Duggirala MPP Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X