• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగువారి ఆత్మగౌరవం కోసం వైసీపీ పోరుబాట: మద్దతు ప్రకటించిన కాంగ్రెస్!

|

అమరావతి: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి 25 సంవత్సరాల ముందే ఆవిర్భవించిన ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒక్కటి కానున్నాయి. ఉమ్మడిగా తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓ తెలుగింటి కోడలిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఉందని గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీ సైతం తన నిరసనను కేంద్రానికి వినిపించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు కూడా లేఖ రాశారు. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని నిలిపివేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి పేటెంట్ గా చెప్పుకొనే తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఈ రెండు పార్టీలు కేంద్రానికి వినిపించడం ఆసక్తికరం.

ఆంధ్రా కోడలి చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు

అదే పేరును కొనసాగించండి..

అదే పేరును కొనసాగించండి..

తెలుగువారి ఆత్మగౌరవానికి, తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలకు కేంద్రబిందువగా నిలిచిన ఆంధ్రా బ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతగా విలీనం చేయాల్సిన అవసరమే వస్తే.. యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లనే ఆంధ్రా బ్యాంకులో విలీనం చేయాలని సూచించారు. ఆంధ్రా బ్యాంకు పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగువారి కీర్తిప్రతిష్టలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యాంకును బ్యాంకును వేరే బ్యాంకులో విలీయం చేయవద్దని బాలశౌరి పేర్కొన్నారు. అలాగే ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. దీనిపై త్వరలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు బ్యాంకింగ్ సెక్రటరీని కూడా కలుస్తామని బాలశౌరి తెలిపారు.

తెలుగు వారి మనోభావాలకు విఘాతం..

తెలుగు వారి మనోభావాలకు విఘాతం..

ఆంధ్రా బ్యాంకును విలీనం చేయవద్దంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సైతం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనోభావాలను కించపరిచినట్టయిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రా బ్యాంకు.. ఇక కనుమరుగు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఇతర రాష్ట్రాల పేర్లతో ఉన్న బ్యాంకులను ఎందుకు విలీనం చేయట్లేదని కేవీపీ ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా బ్యాంకును కొనసాగించాలని, అలా కుదరకపోతే యూనియన్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ లను ఆంధ్రాబ్యాంకులో విలీనం చేయాలని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం భారతీయ జనతపార్టీకి సర్వ సాధారణ విషయమైందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన బీజేపీకి.. ఇది ఓ లెక్కలోకి రాదని విమర్శించారు.

 బీజేపీ, టీడీపీ ఏమంటున్నాయ్..

బీజేపీ, టీడీపీ ఏమంటున్నాయ్..

ఆంధ్రా బ్యాంకు విలీనంపై భారతీయ జనతాపార్టీ గానీ, తెలుగుదేశం పార్టీ గానీ ఇప్పటిదాక ఎక్కడా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న సొంత పార్టీనే ఈ విలీనానికి పూనుకుని ఉన్నందున బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు దీనిపై నోరు విప్పట్లేదు. రాజకీయ పరమైన ఒత్తిళ్లు తీవ్ర స్థాయిలో ఉంటే గానీ బీజేపీ స్పందించకపోవచ్చని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్టే. ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపైనే టీడీపీ తన దృష్టిని కేంద్రీకరించింది.

96 సంవత్సరాల చరిత్ర..

96 సంవత్సరాల చరిత్ర..

సుమారు 96 సంసంవత్సరాల పాటు నిరంతరాయంగా ఖాతాదారులకు సేవలందిస్తూ వచ్చిన ఆంధ్రా బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్ లలో విలీనం కానున్న విషయం తెలిసిందే. ఆంధ్రా కోడలిగా గుర్తింపు ఉన్న నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణాజిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు. మచిలీపట్నం కేంద్రంగా 1923 నవంబర్ 20వ తేదీన ఈ బ్యాంకు తన కార్యకలాపాలను ఆరంభించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన 2017-2018 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రాబ్యాంకునకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2885 శాఖా కార్యాలయాలు ఉన్నాయి. 38 శాటిలైట్ కార్యాలయాలు, 3798 ఏటీఎంలు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party and opposition Congress have taken exception to the Centre''s decision to merge Andhra Bank with two other banks, saying it amounts to hurting the sentiments of the Telugu people. They demanded that the Centre withdraw its decision and if merger is inevitable the name of Andhra Bank should be retained. YSRCP MP Vallabhaneni Balashowry strongly opposed the merger announced on Friday. The Lok Sabha member from Machilipatnam also wrote a letter to Prime Minister Narendra Modi in this regard on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more