చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ - కీలక సూచనలు, మార్పులు..!!

ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేసాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఆలోచన భిన్నంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. జగన్ కు ధీటుగా సంక్షేమ పథకాలు, ప్రచారంతో పాటుగా..అభ్యర్దుల విషయంలోనూ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

కీలక మంతనాలు
ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు ప్రతీ నిర్ణయం ఆచి తూచి తీసుకుంటున్నారు. అభ్యర్దుల ఎంపిక విషయంలోనూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత కసరత్తు చేసినట్లు వెల్లడించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్దులను ఖరారు చేసారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించారు. బీజేపీతో పొత్తు పైన చర్చలు జరిగినా..ఆ పార్టీ నిర్ణయం ఏంటనేది అధికారికంగా స్పష్టత రాలేదు. బీజేపీ ఒంటరి పోరుకే సిద్దం అవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో, రెండో జాబితా పైన చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరిద్దరి సమావేశం జరిగింది.

Political strategist Prasanth Kishor discussed over Manifesto and Election Campaign

జాబితాపై కసరత్తు
పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లను మినహాయిస్తే మరో 57 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు నిరాకరిస్తే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా ప్రశాంత్ కిశోర్ భేటీలో ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు..ధీటుగా కూటమి నుంచి అభ్యర్దుల ఎంపికలో అమలు చేయాల్సిన సోషల్ ఇంజనీరింగ్ పైన చర్చ జరిగినట్లు సమాచారం. అదే సమయంలో మిగిలిన 57 స్థానాల్లోనూ ఏ వర్గానికి ఎన్ని అవకాశం ఉంది..జగన్ సామాజిక లెక్కలను అధిగమించే స్థాయిలో ఉండేలా కూర్పూ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, పార్టీ మేనిఫెస్టో పైన ప్రశాంత్ కిశోర్ సూచినలు చేసినట్లు చెబుతున్నారు.

మేనిఫెస్టోపై చర్చ
జగన్ పూర్తిగా తాను అమలు చేసిన సంక్షేమమే తిరిగి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. దీంతో, టీడీపీ ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన పథకాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని..అవి కేవలం టీడీపీ పథకాలుగా మాత్రమే కాకుండా కూటమి ఉమ్మడి హామీలుగా ప్రజలకు వివరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక..ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు - పవన్ కలిసి ఎక్కువ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలనేది పీకే సూచనగా సమాచారం. ఇక, వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈలోగా అభ్యర్దుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి ప్రచారం ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+