వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్-రాజకీయం: ఏ టర్న్ అయినా తీసుకోవచ్చు.. వీర్రాజు వ్యాఖ్య

భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది అన్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారతాయని తెలిపారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: భారతీయ జనతా పార్టీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే క్రికెట్ మ్యాచ్ లాంటిది అన్నారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారతాయని తెలిపారు.

రాబోయే ఎన్నికల నాటికి అన్ని పార్లమెంట్ స్థానాల్లో బలమైన శక్తిగా ఎదగాలన్నదే తమ పార్టీ వ్యూహమని ఆయన చెప్పారు. కాపులకు రిజర్వేషన్ టిడిపి మేనిఫెస్టోలో ఉన్న అంశమని చెప్పారు.

<strong>పవన్ కళ్యాణ్ ప్రశ్నించొచ్చు, నిలదీస్తాం: బాబుకు వీర్రాజు ఝలక్</strong>పవన్ కళ్యాణ్ ప్రశ్నించొచ్చు, నిలదీస్తాం: బాబుకు వీర్రాజు ఝలక్

దానిని అమలు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు. రాజకీయాలు కూడా ఓ విధంగా క్రికె్ట్ మ్యాచ్ లాంటివేనని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. క్రికెట్లో వలె రాజకీయాలు కూడా ఎప్పుడు ఎలాంటి మలుపు అయినా తిరుగుతాయన్నారు.

సోము వీర్రాజు టార్గెట్

సోము వీర్రాజు టార్గెట్

సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ - టీడీపీలు మిత్రపక్షాలు అయినప్పటికీ ఆయన మొదటి నుంచి చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

ప్రశ్నించడానికి సమర్థన

ప్రశ్నించడానికి సమర్థన

పలు సమస్యలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తున్న పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన ఇటీవల సమర్థించారు. సోము వీర్రాజు, పురంధేశ్వరి వంటి వారు నిత్యం చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.

చంద్రబాబుకు ఝలక్

చంద్రబాబుకు ఝలక్

తాము మోడీ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అయినప్పటికీ పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి వారు మాత్రం టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఏం జరుగుతోంది?

ఏం జరుగుతోంది?

తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మాత్రం మరింత ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయాలు క్రికెట్ మ్యాచ్ లాంటివి అని, ఎప్పుడు ఏ టర్న్ అయినా తిరగవచ్చునని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ వచ్చే ఎన్నికల్లో సొంతగా పోటీ చేయాలని చూస్తోందా? లేక జగన్ లేక మరెవరితోనైనా కలిసేందుకు చర్చలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జగన్ కూడా బీజేపీ అవకాశమిస్తే ఆ దిశగా నడిచేందుకు సిద్ధంగా ఉన్నాడనే వాదనలు ఉన్నాయి.

ఏపీలో బలోపేతానికి ఇప్పటికే వ్యూహాలు

ఏపీలో బలోపేతానికి ఇప్పటికే వ్యూహాలు

దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని, ఏపీలోను పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నాయకులు ఆదివారం విశాఖలోని రుషికొండలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు.

వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని..

వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని..

ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో గెలవడానికి ప్రధాన కారణం గత రెండేళ్లుగా బూత్‌ స్థాయిలో బీజేపీని బలోపేతం చెయ్యడమేనని ఈ సందర్భంగా ఆదివారం నేతలు పేర్కొన్నారు. ఏపీలోనూ బీజేపీని పూర్తిస్థాయిలో బలపరచడానికి నాయకులు క్రియాశీల కార్యకర్తలను నియమించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు.

English summary
BJP leader Somu Veerraju said that Politics is like cricket. He said no one knows when the game willtake an unexpected turn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X