వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీ రచ్చ: దామోదర, పొన్నాలపై బూతులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన తెలంగాణ కాంగ్రెసు పార్టీ మంగళవారం గాంధీ భవనంలో రివ్యూ మీటింగ్ జరిపింది. ఈ సమయంలో గాంధీ భవన్లో ముఖ్య నేతలను పలువురు నిలదీశారు.

ఎన్నికల ఫలితాలపై ఈనెల 24, 25 తేదీల్లో రెండు రోజులపాటు సమీక్ష నిర్వహిస్తామని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమావేశం అనంతరం చెప్పారు. ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలని నిర్ణయించామన్నారు.

జిల్లా పరిషత్ ఫలితాల్లో హంగ్ వచ్చిన చోట్ల స్థానికంగా పొత్తులుంటాయన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి తన అనుచరులు, కాంగ్రెస్ జడ్పీటీసీలతో కలిసి తెరాసలో చేరడంపై దామోదర చర్చిస్తున్నారని, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి జడ్పీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ వల్లే ఓడిపోయిందని, ఇంకా పదవుల్లో ఎలా కొనసాగుతారని, ఏ ముఖం పెట్టుకుని గాంధీ భవన్‌కు వస్తారని టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహలను పిసిసి కార్యదర్శి బొల్లి కిషన్ మంగళవారం తీవ్ర పదజాలంతో దూషించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

దీంతో మంగళవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ కాంగ్రెసు పార్టీ సమావేశం రచ్చరచ్చగా మారింది. పార్టీ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ కొనసాగాలంటూ సోమవారం సిడబ్ల్యూసి చేసిన తీర్మానానికి మద్దతు పలుకుతూ తీర్మానం చేయాలని టిపిసిసి కూడా భావించింది.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

ఈ మేరకు గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నేతలు పొన్నాల, దామోదర, ఉత్తమ్, డి శ్రీనివాస్, జి చిన్నారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

తొలుత పొన్నాల మాట్లాడుతూ.. సిడబ్ల్యూసి తీర్మానాన్ని సమర్థిస్తూ తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. దీనిని మాజీ మంత్రి చిన్నారెడ్డి సమర్థించారు. తీర్మానాన్ని రాజనరసింహ చదువుతారని ప్రకటించారు. టిపిసిసి చేసిన తీర్మానాన్ని దామోదర రాజనరసింహ చదివి వినిపించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ, ఆహార భద్రత వంటి ఎన్నో ప్రజోపయోగ చట్టాలను యూపీఏ ప్రభుత్వం చేపట్టిందని, సంక్షేమ పథకాలకు సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని, అయినా, పదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకత రావడం సహజమేనని చదివి వినిపించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలకు తావు లేకుండా సోనియా ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని, తెలంగాణలో పార్టీ ఓటమికి తనదే బాధ్యత అని పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

అంతేకాకుండా దేశంలో ఏర్పడ్డ రాజకీయ కారణాలతోనే తెలంగాణలోనూ పార్టీ ఓటమి పాలయిందని ప్రాథమికంగా అంచనా వేస్తూ అందుకు టిపిసిసి ఉమ్మడి బాధ్యత వహిస్తుందని తీర్మానిస్తున్నామని, సోనియా అధ్యక్షురాలిగా, రాహుల్ ఉపాధ్యక్షునిగా భవిష్యత్తులోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన నిలబడాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ తీర్మానించిందని రాజనరసింహ చదివి విన్పించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

దానికి సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సిడబ్ల్యూసి తీర్మానాన్ని బలపరుస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

ఇదే సమయంలో తాము మాట్లాడతామని పిసిసి కార్యదర్శి బొల్లి కిషన్‌తోపాటు మరో ముగ్గురు కోరారు. దీంతో, నేతల అభిప్రాయాలను మరోసారి తెలుసుకుంటామని పొన్నాల చెప్పారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

దీంతో కిషన్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. మీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందని బూతుల వర్షం కురిపించారు. దాంతో, సమావేశాన్ని ముగిస్తున్నట్లు పొన్నాల ప్రకటించారు. సమావేశం నుంచి అందరూ బయటకు వచ్చేశారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

రాజనరసింహ తన వాహనం వద్దకు వెళుతుంటే.. కిషన్‌తోపాటు పలువురు అనుసరించారు. పరుష పదజాలంతో దూషణ పర్వాన్ని కొనసాగించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

దీంతో ఆగ్రహోద్రుడైన దామోదర రాజనర్సింహ... ఇక ఆపు, ఇదంతా మీడియాలో రావడానికేగా, నీవనుకున్నది అయిపోయిందని వ్యాఖ్యానించారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

ప్రచార కమిటీ చైర్మన్‌గా నియోజకవర్గానికే పరిమితమయ్యారని, కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని బొల్లి కిషన్ వారిని తప్పు పట్టారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

కిషన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన దామోదర రాజనర్సింహ... ఎవరితో చెప్పుకొంటావో చెప్పుకో అని వ్యాఖ్యానిస్తూ తన వాహనం ఎక్కారు.

టి కాంగ్రెస్

టి కాంగ్రెస్

బీహార్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారని, కానీ, తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి నేతలు బాధ్యత వహించకపోవడం వింతగా ఉందని నల్లగొండ జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు జ్ఞాన సుందర్ తప్పుబట్టారు.

English summary
Ponnala holds meeting with T Congress leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X