బాబు లేఖ, జగన్ చేతకాదన్నప్పుడేం చేశారు: పొన్నం
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు, విభజనపై తాను చేతకానివాడినని, మీరే నిర్ణయాలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు కాంగ్రెసు పార్టీ, ఇతర పార్టీల సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఏం చేశారని కరీంనగర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో మండిపడ్డారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు యూపిఏ ప్రభుత్వం పైన సభాపతి మీరా కుమార్‌కు అవిశ్వాస నోటీసు ఇవ్వడంపై పొన్నం మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎంపి సబ్బం హరికి విశ్వాసం అనే పదానికి అర్థం తెలుసా చెప్పాలన్నారు.

తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ రహస్యంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. అది తెలిసి కూడా సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలు అవిశ్వాసం నోటీసు ఇవ్వడం చూస్తుంటే వారికి నైతిక విలువలు లేవని అర్థమవుతోందని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ 2004 ఎన్నికలకు ముందు తెలంగాణపై హామీ ఇచ్చిందన్నారు. 2009 డిసెంబర్ 9 పార్లమెంటులో ప్రకటన చేసిందన్నారు.
విభజనపై శైలజానాథ్
తెలంగాణ ఏర్పాటుకు మానవ నిర్ణయం మాత్రమే జరిగిందని, ఇంకా దైవ నిర్ణయం జరగలేదని మంత్రి శైలజానాథ్ చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. తెలిపారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీనివాసున్ని దర్శింకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications