వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాట కాదు.. తోలు తీస్తాం: పవన్‌ వ్యాఖ్యలపై పొన్నం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను అవమానించేలా వ్యవహరించినా, వ్యాఖ్యలు చేసినా తోలుతీస్తామని పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని పొన్నం అన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా గురించి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు. తాట తీస్తాం అనేది ఆంధ్రా పదమని, తమ భాషలో తోలుస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయరంగ ప్రవేశం చేశారని అన్నారు.

Ponnam Prabhakar fires at Pawan Kalyan

చంద్రబాబే కాదు అనేకమంది రాజకీయ నాయకులు పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనేనని చెప్పారు. నోవాటెల్‌లో సామాన్యులు ప్రవేశించలేరని, నోవాటెల్ స్థాయి పార్టీ అంటే కోటీశ్వరులదేనని, అది సామాన్యుల పార్టీ కాదని పొన్నం అన్నారు. నోవాటెల్‌లో పుట్టిన కాంగ్రెస్ పార్టీ అక్కడే కనుమరుగవుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

తాళి కట్టిన భార్యతోనే నిండు నూరేళ్లు కలిసి ఉండలేని పవన్, ప్రజలకేం చేస్తాడని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనకు ఏం మాట్లాడుతున్నాడో.. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదని విమర్శించారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, ముందు మనిషిలా ప్రవర్తించడం నేర్చుకోమ్మని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నియంతలు కూడా పార్టీ పెడుతున్నారని విమర్శించారు.

నా తెలంగాణ అనుకుంటూనే.. విమర్శలు చేస్తే ఊరుకోమని పొన్నం హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల కుటుంబమని, ఆ పార్టీపై విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదని అన్నారు. పవన్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. పవన్ ముందు అతని పార్టీ అజెండా ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
Congress MP Ponnam Prabhakar on Saturday fired at Janasena Party President Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X