విజయసాయిరెడ్డిపై పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్..నాది కూడా సేమ్ స్టోరీ
దేవాదాయ శాఖ కమిషనర్ శాంతిపై గత రెండు రోజులుగా వస్తోన్న ఆరోపణలు అందరికి తెలిసిన విషయమే. శాంతి భర్తగా మదన్ మోహన్ ఓ ఫిర్యాదు చేయడం, తన భార్య గర్భం దాల్చిందని, వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి దానికి కారణం అంటూ ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాంతి భర్త విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె గర్భవతి అయిందని, దీని వెనుక విజయ సాయిరెడ్డి కారణని ఓ వర్గం మీడియా ఆరోపిస్తోంది.
దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు. మదన్ మోహన్‌తో ఎప్పుడో విడాకులు అయ్యాయని, సుభాష్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగిందని, తమ ఇద్దరికీ ఓ బిడ్డ పుట్టిందని శాంతి వివరించారు. కానీ మీడియా మాత్రం విజయసాయిరెడ్డితో అక్రమ సంబంధం అంటగట్టిందని, తమ బిడ్డ అక్రమ సంతానం అని ముద్ర వేస్తోందని వాపోయారు. మీడియా ఇలా వ్యక్తిగత స్వేచ్చను, ప్రైవసీని హరించడం, వ్యక్తిత్వ హననం చేయడం సరికాదని కన్నీరు పెట్టుకున్నారు.

ఈ ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి సైతం మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన ఓ గుండా తనను కించపరిచేలా మాట్లాడాడని, ఇంటికి వస్తే పారిపోయానంటూ ప్రచారం చేసుకుంటోన్నాడని సాయిరెడ్డి చెప్పారు. ఆ గుండాకు తాను ఒకటే చెబుతున్నానని, టైం, ప్లేస్ చెబితే తానే అక్కడికే వస్తా, ఎవరి దమ్ము ఎంతో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. అసత్య వార్తలను రాసి, తన వ్యక్తిగత పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని తేల్చి చెప్పారు. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో.. అన్ని రకాలుగా తన నిర్ణయాలు ఉండబోతోన్నాయని అన్నారు. ఈ విషయంలో సొంత పార్టీ వాళ్లయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన.
తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. పూనమ్ కౌర్ తన మద్దతు విజయ సాయిరెడ్డికే అని తెలిపారు. ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్ట్ పెడుతూ..విజయసాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థల్లా తయారయ్యాయి. నా విషయంలోనూ ఇలాంటి క్రమాన్నే వాడారు.. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చెబుతారు.. మనం ఏడిస్తే.. కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది.. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి.
Be brave ✊ pic.twitter.com/tB2JlsYMol
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 15, 2024
గిరిజన మహిళ అయిన శాంతికుమారి తరఫున నిలబడిన విజయసాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.. మీ వెంటే నేనుంటా.. మీరు ఈ పోరాటాన్ని వదిలి పెట్టకండి.బుద్ధిలేని టీవీ ఛానెళ్లు ఆమె గర్భం దాల్చిందని తెలీగానే ఎవరి దగ్గరో డబ్బు తీసుకుందని.. సేమ్ కథను రిపీట్ చేస్తున్నారు. నేను శాంతికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏడిస్తే అది వారికి గెలుపు అవుతుంది. ఇలాంటి ఎదవల కోసం నీ కన్నీరును వృథా చేసుకోకు. నీకు న్యాయం జరిగేలా చూసేందుకు నీ భర్త నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు అని పూనమ్ కౌర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications