వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో స్పందనకు స్పందన కరవు-ఫిర్యాదులపై నిర్లిప్తత-జగన్ కొరడా ఝళిపించాల్సిందే ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లతో పాటు కింది స్ధాయిలో ఉన్న అధికారులు తమ తమ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు చీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు వాటిని నేరుగా సీఎంవోకు పంపాలని అప్పట్లో కోరారు. వీటిపై ప్రతీ మంగళవారం సీఎం జగన్ రాష్ట్రస్దాయిలో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో మాట్లాడి సమక్షించేవారు. కానీ ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.

సచివాలయాల ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్-సెప్టెంబర్లో సప్లిమెంటరీ-అక్టోబర్ లో అపాయింట్మెంట్సచివాలయాల ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్-సెప్టెంబర్లో సప్లిమెంటరీ-అక్టోబర్ లో అపాయింట్మెంట్

స్పందనతో ఫిర్యాదుల పరిష్కారం

స్పందనతో ఫిర్యాదుల పరిష్కారం

ఏపీలో ప్రజల నుంచి నిత్యం వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం గత ప్రభుత్వాల హయాంలో ఏదో ఒక వేదిక ఉండేది. అలా వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుని, వాటికి పరిష్కారం చూపాలని అధికారులకు ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఇలా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు లభించిన పరిష్కారం, పెండి్ంగ్ అంశాలపై తిరిగి ప్రతీ మంగళవారం సీఎం జగన్ సచివాలయం నుంచే సమీక్ష నిర్వహించేవారు. ఎక్కువగా ఏయే అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయో తెలుసుకుని వాటికి పరిష్కారం కనుగొనాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. ఇందుకోసం విధానపరమైన మార్పులూ చేశారు.

స్పందనకు తగ్గిన ఆదరణ

స్పందనకు తగ్గిన ఆదరణ

ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. అధికారులు వివిధ పనుల్లో బిజీగా మారిపోవడంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ స్పందన జరుగుతుందో కచ్చితంగా తెలియని పరిస్ధితి,. చాలా చోట్ల అధికారుల్ని వారిపై ఉండే ఉన్నతాధికారులు అత్యవసర పనులు అప్పగించడంతో స్పందన కార్యక్రమం నిర్వహించే తీరిక లేకుండా పోతోంది. ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా అధికారులు క్షణం తీరికలేకుండా మారిపోతున్నారు. దీంతో స్పందనలో ఫిర్యాదుల్ని పరిష్కరించే తీరిక వీరికి లేదు. దీంతో సహజంగానే స్పందన కు ఆదరణ తగ్గుతూ వస్తోంది.

 స్పందనకే స్పందన కరవు

స్పందనకే స్పందన కరవు

స్పందన కార్యక్రమం నిర్వహణను ప్రభుత్వం గతంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉన్నతాధికారుల నుంచి కింది స్ధాయి అధికారుల వరకూ ఆదేశాలు జారీ చేసేది. వీటిపై నేరుగా సీఎం జగన్ ప్రతీ మంగళవారం సమీక్ష జరుపుతుండటంతో అధికారుల్లోనూ ఆ భయం ఉండేది. కానీ ఇప్పటికీ అదే స్ధాయిలో స్పందన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. వీటిపై సీఎం జగన్ సమీక్షలు కూడా జరుగుతున్నాయి. కానీ క్షేత్రస్ధాయిలో మాత్రం వివిధ కారణాలతో వీటికి స్పందన కరవవుతోంది. ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కాకపోవడం, తరచూ స్పందనకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పరిస్ధితులు, స్పందనలో ఫిర్యాదు ఇచ్చినా మళ్లీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్దితులు దీన్నో ఫార్సుగా మార్చేస్తున్నాయి.

ఆర్ధిక పరిస్ధితి ప్రధాన కారణం

ఆర్ధిక పరిస్ధితి ప్రధాన కారణం

రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర ఖజానా దివాలా తీసింది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కానీ, పెన్షనర్లకు పించన్లు కానీ సకాలంలో ఇచ్చే పరిస్ధితులు లేవు. దీంతో సహజంగానే ఈ ప్రభావం ప్రజలపైనా పడుతోంది. తమకు సంక్షేమ పథకాలు రాలేదనో, తాము ఉంటున్న ప్రాంతాల్లో అభివృద్ది కార్యకమాలు జరగడం లేదనో, డబ్బుతో సంబంధం ఉన్న ఇతర అంశాలపైనో వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించడం ప్రభుత్వానికి కష్టసాధ్యంగా మారింది. అసలే ఆర్ధిక పరిస్దితి అంతంత మాత్రంగా ఉండటంతో ఈ ఫిర్యాదుల పరిష్కారం కుదరడం లేదు. దీంతో ఫిర్యాదుదారులకు ఏం చెప్పాలో తెలియక అధికారులు తిప్పిపంపుతున్నారు. ఇలా వరుసగా ఒకట్రెండు సార్లు తిప్పిపంపితే వారు రావడం మానేస్తున్నారు.

ఫిర్యాదుదారుల్లో అసహనం

ఫిర్యాదుదారుల్లో అసహనం

స్పందన కార్యక్రమానికి వస్తే గతంలో ఫిర్యాదుల్ని వారం రోజుల్లో పరిష్కరించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఆర్ధిక విషయాల్ని పక్కనబెట్టినా మిగతా అంశాలపైనా అధికారుల స్పందన పేలవంగా ఉంటోందని చెప్తున్నారు. పలు ప్రభుత్వ శాఖలతో సంబంధం ఉన్న అంశాల్లో క్లారిటీ లేక మరికొన్ని ఫిర్యాదులు మూలపడుతున్నాయి. దీంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారిలో అసహనం పెరుగుతోంది. ఇలా ఒకటికి రెండు సార్లు జరిగితే మూడోసారి స్పందనకు వచ్చేందుకు వారు ఆసక్తి చూపడం లేదు. దీంతో స్పందనకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య కూడా తగ్గిపోతోంది. అంతిమంగా ప్రభుత్వం కూడా స్పందనలో ఫిర్యాదులు రావడం లేదు కదా అన్న ఉద్దేశంలో ఉండిపోతోంది.

జగన్ లో సీరియస్ నెస్ తగ్గిందా ?

జగన్ లో సీరియస్ నెస్ తగ్గిందా ?


గతంలో స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ప్రభుత్వం అధికారులకు డెడ్ లైన్లు పెట్టేది. స్వయంగా సీఎం జగన్ సోమవారం వచ్చే పిర్యాదులపై మంగళవారం స్పందించేవారు. ఒకే అంశంపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. కానీ ఎప్పుడైతే ఫిర్యాదుల పరిష్కారం కావడం లేదో అప్పుడు క్షేత్రస్ధాయిలో ఫిర్యాదుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీంతో సీఎం జగన్ కూడా ప్రభుత్వంలో ఎలాంటి ఫిర్యాదులు లేవనే ధోరణిలో ఉండిపోతున్నారు. గతంతో పోలిస్తే అన్ని సమస్యల్ని అధికారులు పరిష్కరించేస్తున్నారన్న ధీమాలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు కూడా స్పందనపై సీరియస్ నెస్ తగ్గిందన్న ప్రచారం జరుగుతోంది. ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, కరోనా ప్రభావం వంటి కారణాలతో జగన్ కూడా స్పందనలో వచ్చే సాధారణ ఫిర్యాదుల్ని మునుపటిలా అంత సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తోంది.

English summary
andhrapradesh government's grievance redressal programme spandana got poor response with negligence of officials in solving problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X